తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం పెరుమల్లాపురం సమీపంలో గల అవలదారుపాడు గ్రామంలో కోడిపందాలు ఆడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేయగా పందెం రాయుళ్లు ఒక్క సారిగా పోలీసులపై కర్రలు, రాళ్లు, మారణాయుధాలతో దాడి చేసి గాయపరిచారు. మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆదివారం మనిమల్ల దొంగబ్బాయి, గంపల సత్తిబాబు అనేవారికి చెందిన సారా బట్టిని పోలీసులు పట్టుకున్నారు అనే కోపంతో మిగిలిన జనాన్ని రెచ్చగొట్టి పోలీస్ వారిపైకి దాడి చేయడానికి ప్రేరేపించినట్లు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం తెలియడంతో ఎస్. పి. ఈ దాడిని సీరియస్ గా తీసుకున్నారు. గాయపడిన ఎ. ఎస్. ఐ. ఆంజనేయులు, హోమ్ గార్డ్ సతీష్ లకు గాయములు కాగా వారిని తొండంగి ఎస్. ఐ. కృష్ణాచారి చికిత్స నిమిత్తం తుని ఏరియా ఆసుపత్రికి తరిలి0చినట్లు తెలిపారు.
పోలీసులను చావబాదిన కోడిపందేల రాయుళ్లు
Related tags :