Movies

సల్మాన్ ఎదుట వంగబడతారు

Media Is Fine With Whatever Salman Does-Slams Kangana

ప్రముఖ బాలీవుడ్‌ నాయకానాయికలు హృతిక్‌ రోషన్‌, కంగనా రనౌత్‌ మధ్య ఉన్న వివాదం గురించి తెలిసిందే. హృతిక్‌ తనతో కొన్నాళ్ల పాటు సన్నిహితంగా ఉండి ఆ తర్వాత మోసం చేశాడంటూ కంగన ఆమధ్య విమర్శలు చేసింది. అప్పట్నుంచి సందర్భం దొరికినప్పుడల్లా హృతిక్‌పై నిప్పులు చెరుగుతూనే ఉంది కంగన. అయితే ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో కంగనకు హృతిక్‌ గురించి ఓ ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె చెప్పిన సమాధానం చర్చనీయాంశం అవుతోంది. ‘‘మీరు ఓ రోజు ఉదయం లేవగానే హృతిక్‌లా మారిపోతే ఏం చేస్తారు?’’ అని కంగనను అడిగితే, దానికి ఆమె బదులిస్తూ ‘‘నేను హృతిక్‌లా మారిపోతే కంగనకు ఫోన్‌ చేసి క్షమాపణలు అడుగుతాను. మన మధ్య జరిగిందేదో జరిగింది. ఈ విషయంలో నేను చేసిన పనికి మన్నించమంటాన’’ని చెప్పింది. ‘‘సల్మాన్‌ ఖాన్‌లా మారిపోతే ఏం చేస్తారు’’ అని అడిగితే.. ‘‘మీడియా వారి చెవులు మెలేస్తాను. ఆ పని సల్మాన్‌ చేస్తే మీడియాకు ఓకే. కానీ నేను చేస్తే ఓకే కాదు కదా’’ అని నవ్వుతూ చెప్పింది కంగన.