ఏపీ తొలి శాసనసభాపతి కోడెల శివప్రసాద్ పెద్దకర్మ సందర్భంగా న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో ఆయనకు, తెదేపా మాజీ ఎంపీ నారమల్లి శివప్రసాద్‌కు న్యూజెర్సీ ఎన్నారై తెదేపా ఘనంగా నివాళులు అర్పించింది. నాట్స్ మాజీ అధ్యక్షులు, తెదేపా సీనియర్ నాయకులు మన్నవ మోహనకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తెదేపా అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. మన్నవ మాట్లాడుతూ కోడెలతో తనకున్న జ్ఞాపకాలను స్మరించుకున్నారు. ఎన్.టీ.ఆర్ పిలుపు మేరకు తెదేపాలో జేరిన కోడెల ఆయనకు అప్పగించిన అన్ని బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని ఆయన కొనియాడారు. కార్యక్రమానికి హాజరయిన అతిథులు ప్రసంగిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కోడెల అని, పార్లమెంట్ వద్ద ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజీలేని పోరాటం చేసిన నారమిల్లి కార్యకర్తలకు ఆదర్శప్రాయులను అభిప్రాయపడ్డారు. రెండు నిముషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. కార్యక్రమంలో శ్రీహరి మందాడి, రాజా కసుకుర్తి, రాధాకృష్ణ నల్లమల, వంశీ వెనిగళ్ల, రమేష్ నూతలపాటి, మోహనకుమార్ వెనిగళ్ల, విష్ణు కనపర్తి, శ్రీ చౌదరి, నంద కల్లూరి, శ్రీనివాస్ ఓరుగంటి, సురేష్ బొల్లు, సూర్య గుత్తికొండ, రాజేష్ బేతపూడి తదితరులు పాల్గొన్నారు.
కోడెల నారమల్లిలకు న్యూజెర్సీ ఎన్నారై తెదేపా నివాళి
Related tags :