Movies

టైగర్ పె ప్యార్

Shraddha Kapoor Speaks About Tiger Shroff

బాలీవుడ్ కథానాయకుడు టైగర్‌ ష్రాఫ్‌ అంటే తనకు ఇష్టమని శ్రద్ధా కపూర్‌ చెప్పారు. తాజాగా ఆమె ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమెను టైగర్‌తో తన తర్వాతి సినిమా ‘బాఘీ 3’ గురించి ప్రశ్నించారు. ఆమె స్పందిస్తూ.. ‘టైగర్‌ నాకు ప్రియమైన వ్యక్తి. నిజమే.. అతనంటే నాకు ఇష్టం’ అని అన్నారు. టైగర్‌, దిశా పటానీ ప్రేమలో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ వారిద్దరు తమ మధ్య బంధాన్ని బయటపెట్టలేదు. మేం మంచి స్నేహితులమని ఇప్పటికే పలుమార్లు చెప్పారు. శ్రద్ధా, టైగర్‌ కలిసి ‘బాఘీ’ సినిమా కోసం పనిచేశారు.మరోపక్క ఫర్హాన్‌ అక్తర్‌తో శ్రద్ధా ప్రేమలో ఉన్నారని వదంతులు ఉన్నాయి. ఇదే సందర్భంగా ఫర్హాన్‌తో బంధం గురించి ‘సాహో’ భామను మీడియా ప్రశ్నించింది. ‘నటుడిగా, గాయకుడిగా, దర్శకుడిగా ఫర్హాన్‌పై నాకు అభిమానం ఉంది. దానికి మించి ఏమీ లేదు. అతడు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుంటాడు. అది గొప్ప విషయం. ముంబయిలో మెట్రో షెడ్‌ ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. ఓ సాధారణ పౌరురాలిగా నేను కూడా నా వంతు ప్రయత్నిస్తున్నా. ప్రభుత్వం స్పందిస్తుందని ఆశిస్తున్నా’ అని అన్నారు. శ్రద్ధా ఈ ఏడాది ‘సాహో’, ‘చిచ్చోరే’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద విజయం అందుకున్నాయి. ప్రస్తుతం ఆమె ‘స్ట్రీట్‌ డ్యాన్సర్‌’, ‘బాఘీ 3’ సినిమాల్లో నటిస్తున్నారు.