* ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ప్రగతిభవన్ వేదికగా సాయంత్రం 4 గంటలకు జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
* ప్రముఖ బాలీవుడ్ నటుడు వీజూ కోఠె కన్నుమూశారు. 77 సంవత్సరాల వయసున్న ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హిందీ, మరాఠీ భాషల్లో 300కు పైగా సినిమాల్లో నటించారు. కాళీ, సోలీ పేర్లతో ఆయన పాపులర్‌గా నిలిచారు. 1964 సంవత్సరంలో యా మలక్ చిత్రంలో చేసిన పాత్ర తన సినీ జివితాన్ని మలుపు తిప్పింది. షోలే, అందాజ్ అప్నా అప్నా, ఖుర్బాని, ఖర్జ్, నగీనా, చైనాగేట్ తదితర చిత్రాల్లో నటించారు. వీజూ కొఠె అక్క శుభ కోఠె కూడా సీనియర్ నటి. తండ్రి నందూ కొఠె రంగస్థల నటుడు, అత్త దుర్గ కొఠె ప్రముఖ నటి. ఆయన నటించిన చివరి చిత్రం 2018 సంవత్సరంలో వచ్చిన జానే క్యొ దె యారాన్.
* సుదీర్ఘకాలం భారత వైమానిక దళానికి విశిష్ట సేవలందించిన భారత ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా ఇవాళ పదవీ విరమణ చేశారు. ధనోవా స్థానంలో నూతన ఎయిర్ చీఫ్ మార్షల్గా రాకేశ్కుమార్ సింగ్ భదౌరియా బాధ్యతలు స్వీకరించారు.
* పంచాయితీ రాజ్ భవన్ ముట్టడికి యత్నించిన 13 జిల్లాల పంచాయితీ కార్మికులుఅరెస్ట్ చేసి తాడేపల్లి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులుతాడేపల్లి పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగిన పంచాయితీ కార్మికులుఅరెస్ట్ చేసిన తమ నాయకులను తక్షణమే విడుదల చేయాలంటూ తీవ్ర ఆగ్రహంతమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్జీతాలు ఇవ్వక దుర్భర జీవితాన్ని గడుపుతున్నామని వాపోయిన కార్మికులుగ్రామసచివాలయాల్లో పంచాయితీ కార్మికుల్లో అర్హత ఉన్నవారికి అవకాశం కల్పించాలని కోరారుమున్సిపల్ కార్మికులతో పాటు సమాన వేతనాలు మంజూరు చేయాలని కోరారుసీఎం జగన్ పాదయాత్రలో మాకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని తెలిపారు
* సచివాలయ’ ఉద్యోగుల విధివిధానాలు ఖరారుమూడు ప్రాంతాలను ఎంచుకునే చాన్స్‌వీలైనంత వరకు మొదటి ప్రాధాన్యతగా కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్ ఒకే పోస్టుకు ఎక్కువ మంది పోటీ పడితే రెండు, మూడు ప్రాధాన్య స్థానాల్లో నియామకం అపాయింట్‌మెంట్ లెటర్ల తర్వాత ఉద్యోగులకు వేరుగా పోస్టింగ్ ఆర్డర్లు అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గ్రామ, వార్డు సచివాలయాలుఉద్యోగులకు నేడు విజయవాడలో నియామక పత్రాలు అందజేయనున్న సీఎం వైఎస్ జగన్
*తెలంగాణా ఇంటర్మీడియట్ విద్యార్ధుల ఆత్మహత్యల పై దాఖలైన పిటిషన్ ను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరిమ్చింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని జస్తీస్ట్ నవీన్ గావే ధర్మాసనం స్పష్టం చేసింది. తెలంగాణలో విద్యార్ధుల ఆత్మహత్యల పై నివేదిక తెప్పించుకుని భవిష్యత్తు లో పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు ఇవాలని బాలల హక్కు సంఘం సుప్రీంకోర్టు ఆశ్రయించింది.
*శ్రీశైలం డ్యాంకు ఆదివారం వరద మరింత తగ్గింది. జూరాల నుంచి విద్యుదుత్పత్తి ద్వారా 40,583 క్యూసెక్కులు, క్రస్ట్గేట్ల ద్వారా 83,576 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 17,516 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 110 క్యూసెక్కుల వరద వస్తోంది. మొత్తం ఇన్ఫ్లో 1,41,785 క్యూసెక్కులుగా నమోదైంది. దీంతో ఒక క్రస్ట్ గేట్ నుంచి సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమగట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి 884.80 అడుగుల వద్ద 214.8450 టీఎంసీల నిల్వలు నమోదయ్యాయి. విద్యుదుత్పత్తి కోసం కుడిగట్టు కేంద్రంలో 26,190 క్యూసెక్కులు, ఎడమగట్టు కేంద్రంలో 42,378 క్యూసెక్కులు వినియోగించుకుంటున్నారు.
*ప్రభుత్వ ఉద్యోగాలకు అభ్యర్థుల వయోపరిమితిని 42 సంవత్సరాల నుంచి 46 ఏళ్లకు పెంచుతూ జీవో జారీ చేయాలని నిరుద్యోగ ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ డిమాండ్ చేశారు. గ్రూప్1 ప్రాథమిక పరీక్ష ఫలితాల కటాఫ్ మార్కులు తగ్గించి కనీసం 40 మందిలో ఒక్కరినైనా ప్రధాన పరీక్షకు ఎంపిక చేయాలని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన కోరారు.
*ప్రభుత్వ ఉద్యోగాలకు అభ్యర్థుల వయోపరిమితిని 42 సంవత్సరాల నుంచి 46 ఏళ్లకు పెంచుతూ జీవో జారీ చేయాలని నిరుద్యోగ ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ డిమాండ్ చేశారు. గ్రూప్1 ప్రాథమిక పరీక్ష ఫలితాల కటాఫ్ మార్కులు తగ్గించి కనీసం 40 మందిలో ఒక్కరినైనా ప్రధాన పరీక్షకు ఎంపిక చేయాలని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన కోరారు.
*భాగస్వామ్య పింఛను విధానం(సీపీఎస్) రద్దుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆదివారం విజయవాడ గవర్నరుపేటలోని రెవెన్యూ భవనంలో రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
*తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి (84) ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. భార్య నాలుగేళ్ల కిందటే దివంగతులయ్యారు. కాంగ్రెస్ తరఫున రెండుసార్లు 1989, 2004లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన మృతిపట్ల ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ తదితర నేతలు సంతాపం వ్యక్తం చేశారు. సోమవారం అంతిమయాత్ర నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.
*శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు ధర్నాకు దిగారు. సాంకేతిక లోపంతో జెడ్డాకు వెళ్లాల్సిన ఓ విమానం 30 గంటలు ఆలస్యంగా బయల్దేరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ నెల 27న సాయంత్రం 5.55 గంటలకు నగరం నుంచి జెడ్డాకు బయల్దేరాల్సిన ఎయిర్ ఇండియా (ఏఐ-965) విమానం సమయానికి శంషాబాద్‌కు రాలేదు.
*మ సచివాలయాల ప్రారంభాన్ని అక్టోబరు 2న వేడుకగా నిర్వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ కలెక్టర్లకు సూచించారు. గ్రామంలో ప్రజలందరి భాగస్వామ్యంతో పండుగ వాతావరణంలో నిర్వహించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11,158 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తుండగా, 2న ప్రతి మండలంలో కనీసం ఒక గ్రామంలో సచివాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లుచేయాలని ఆదేశించారు.
*రోడ్ల నిర్మాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఝలక్ ఇచ్చింది. భవిష్యత్తులో చేపట్టబోయే రోడ్ల నిర్మాణాల్లో భూ సేకరణ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని స్పష్టం చేసింది. ఈ నిధులను భరించడానికి రాష్ట్రాలు ముందుకొస్తేనే కొత్తగా రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టులను చేపడతామని ప్రకటించింది. ఈ మేరకు ‘భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ)’ ఓ ప్రత్యేక సర్క్యులర్ను జారీ చేసింది. చీఫ్ జనరల్ మేనేజరు వి.కె.శర్మ జారీ చేసిన ఈ సర్క్యులర్ను అన్ని రాష్ట్రాలకు పంపించారు.
*తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత ఆత్మహత్యలు చేసుకున్న సుమారు 300కు పైగా చేనేత కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ జేఏసీ చైర్మన్ దాసు సురేష్ కోరారు. చేనేతలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ అమలు చేయడం లేదని, బీమా సౌకర్యాన్ని కూడా కల్పించలేదని ఆయన ధ్వజమెత్తారు.
*మెల్బోర్న్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలో బతుకమ్మ, దసరా వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని తెలంగాణ ఆడపడుచులు బేబ్రూక్ సన్షైన్ వీధిలోని ఓ హాల్లో బతుకమ్మ వేడుకలు జరిపారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి ఇ.పెద్దిరెడ్డి, అర్జున అవార్డు గ్రహీత రవికాంత్రెడ్డి, జానపద గాయకుడు మిట్టపల్లి సురేందర్ పాల్గొన్నారు.
* ఉత్తరాది రాష్ట్రాలను వర్షాలు వణికిస్తున్నాయి. వరుసగా మూడో రోజు వరుణుడి బీభత్సం కొనసాగింది. జనజీవనం స్తంభించిపోయింది. రహదారులు దెబ్బతిని రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు రోజుల్లో 137 మంది ప్రాణాలు కోల్పోయారు.
* బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, అందుకు తోడుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలి పారు. కాగా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న రెండురోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ మీదుగా బీహార్ వరకు కొనసాగు తున్న ద్రోణి ప్రభావం వల్ల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలి పారు.
* టీవీ9 స్టూడియో కెమెరామెన్ రుద్ర మురళి రోడ్డుప్రమాదంలో మృతి చెందడం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దిగ్ర్భాంతికి గురయ్యారు. మురళి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం తెలిపారు.
* భారతీయ సముద్ర తీర ప్రాంతాల వెంట ఉగ్రముప్పు ఇంకా కొనసాగుతూనే ఉందని మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ప్రపంచంలో ఏ దేశానికైనా సొంతంగా భద్రత ఉంటుంది. ఉగ్రముప్పులేదని కొట్టిపారేయలేమని ఆయన వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులు చొరబడకుండా, ఎలాంటి పన్నా గాలకు పాల్పడకుండా నేవీ, కోస్ట్‌గార్డ్ సిబ్బంది సంసిద్ధంగా ఉన్నారని ఆయన వివరించారు.
* అనంతపురం జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఇంటి వద్ద ఓ ఆటో డ్రైవర్ హల్చల్ చేశాడు. తన ఆటోకు నంబరింగ్ ఇవ్వలేదని ఆవేదన చెందిన నాగేంద్ర అనే ఆటో డ్రైవర్ ఎమ్మెల్యే ఇంటి వద్ద ఆటోకు నిప్పంటించి న్యాయం చేయాలని పెద్ద పెద్దగా కేకలు వేశాడు. పుట్టపర్తి నియోజకవర్గంలోని పుట్టపర్తి టౌన్ లో 150 ఆటో లకి నెంబర్ లని ఇవ్వుకుండా చేయడంతో, ఆటో నడుపు కుంటూ జీవనం సాగిస్తున్న నాగేంద్ర అనే ఆటో డ్రైవర్ తన ఆటోని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఇంటి ముందర తగలబెట్టే ప్రయత్నం చేశాడు. గత ప్రభుత్వంలో పల్లె రఘునాథ్ రెడ్డి 150 కొత్త ఆటో నెంబర్ లని ఇచ్చారని, వాటిని తొలగించడం వలెనే ఈ ఘటనకి పాల్పడినట్టు చెబుతున్నారు. పోలీసులు నాగేంద్రను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషనుకు తరలించారు.
* సినీ ఇండస్ట్రీనికి క్యాస్టింగ్ కౌచ్ అంశం పట్టిపీడిస్తోంది. దీనిబారిన ఎంతో మంది హీరోయిన్లుపడినట్టు వార్తలు వచ్చాయి. అలా క్యాస్టింగ్ కౌచ్ బారినపడిన బాధితులు మీ టూ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అపుడు తమకు ఎదురైన అనుభవాలను వారు బహిరంగపరిచారు. ఈ కోవలో తాజాగా బాలీవుడ్ నటి సుర్విన్ చావ్లా చేరింది. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఆమెకు ఎదురైన సంఘటనలను పూసగుచ్చినట్టు వివరిస్తోంది.
* తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించిన హీరోయిన్ సుర్విన్ చావ్లా ఓ ఇంటర్వ్యూలో తాను ఐదుసార్లు కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నానని చెప్పి పెద్ద బాంబే వేశారు. దక్షిణాదిన మూడుసార్లు, ఉత్తరాదిన రెండు సార్లు తాను కాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కొన్నానని ఆమె వెల్లడించింది.
* బుల్లితర నుంచి వెండితెరకు వచ్చిన నాకు సినిమా రంగంలో ప్రయాణం అంత సజావుగా సాగలేదని చెప్పింది. దక్షిణాదిన జాతీయ అవార్డు తెచ్చుకున్న ఓ దర్శకుడి (ఇతనికి తమిళం మాత్రమే వచ్చు) దగ్గరకు ఆడిషన్‌కు వెళితే.. ఏవేవో డైలాగులు చెప్పించి ఏదేదో చేయించాడు. నాకు ఆరోగ్యం సరిగా లేదంటూ ముంబై వచ్చేశాను. వేరే వారితో నాకు ఫోన్ చేయించి ‘నీకు ఆరోగ్యం సరిగా లేదు కదా.. నేను ముంబై రావాలా?’ అని అడిగించాడు. దీనికి నేను నో థ్యాంక్స్ అని సమాధానం చెప్పినట్టు తెలిపారు.
* అరుణాచల్ ప్రదేశ్‌లో ఖోన్సా వెస్ట్ అసెంబ్లి నియోజక వర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న చకత్ అబోహ్‌కు రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతు ప్రకటించాయి. ఎన్‌ఎస్‌సిఎన్ (ఐఎం) మిలిటెంట్ల చేతిలో హత్యకు గురైన ఎమ్మెల్యే తిరాంగ్ అబోహ్ సతీమణి చకత్ అబోహ్ ఈ నియోజక వర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీనితో అధికార బిజెపి, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, జెడి(యు), ఎన్‌పిపి, పిపిఎలు తమ పార్టీలనుంచి అభ్యర్థిని పోటీకి నిలబెట్టకూడదని ఏకగ్రీవంగా నిర్ణయించాయి. ముఖ్యమంత్రి పేమా ఖండూ అధ్యక్షతన సమావేశమైన ఆ పార్టీల నేతలు ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించారు.
* సొంత మండలంలోనే పోస్టింగ్ సచివాలయ’ ఉద్యోగుల విధివిధానాలు ఖరారుమూడు ప్రాంతాలను ఎంచుకునే చాన్స్‌వీలైనంత వరకు మొదటి ప్రాధాన్యతగా కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్ ఒకే పోస్టుకు ఎక్కువ మంది పోటీ పడితే రెండు, మూడు ప్రాధాన్య స్థానాల్లో నియామకం అపాయింట్‌మెంట్ లెటర్ల తర్వాత ఉద్యోగులకు వేరుగా పోస్టింగ్ ఆర్డర్లు అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గ్రామ, వార్డు సచివాలయాలుఉద్యోగులకు నేడు విజయవాడలో నియామక పత్రాలు అందజేయనున్న సీఎం వైఎస్ జగన్
* రాష్ట్ర వ్యాప్తంగా ఉల్లి కొరత ఉన్నందున విజిలెన్స్ అధికారులు నిఘా పెంచారు. ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు రాష్ట్రంలో ఉన్న ఉల్లి కేంద్రాల్లో దాడులు జరిపారు. 34 కేంద్రాల్లో నిబంధనలు పాటించలేదని గుర్తించారు. వీరిలో 28 మంది ప్రభుత్వ అనుమతులు లేకుండా విక్రయాలు నిర్వహిస్తున్నారని విజిలెన్స్ డీజి రాజేంద్రనాథ్ రెడ్డి గుర్తించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 3,398 క్వింటాళ్ల ఉల్లిపాయలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కోటి 65 లక్షల రూపాయల ఉండవచ్చని అంచనా వేశారు. స్వాధీనం చేసుకున్న ఉల్లిపాయలను మార్కెటింగ్ శాఖ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 61 లక్షా 95 వేల రూపాయల విలువ చేసే ఉల్లిపాయలను స్వాధీనం చేసుకున్నారు.
* ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి) నేటినుంచి ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపిఒ) షేర్లను జారీ చేస్తోంది. ఒక్కొక్క షేర్ ధరను 315 నుంచి 320 రూపాయిలుగా నిర్ణయించింది. రిటైల్ ఇన్వెస్టర్లు, అర్హులైన ఉద్యోగులకు 10 రూపాయిల రాయితీని ఇవ్వనున్నది. దీనితో ఐఆర్‌సిటిసి ఐపిఒ రిటైల్, అర్హులైన ఉద్యోగులకు షేర్ ధర 305 రూపాయిలనుంచి 310 రూపాయిలుగా నిర్ణయించింది. ఈ షేర్లు నేటి (సెప్టెంబర్ 30) నుంచి అక్టోబర్ 3వ తేదీ గురువారం వరకూ అందుబాటులో ఉంటాయి.
* తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అన్నారు. శాంతిభద్రతల సమస్య సృష్టించాలని చూస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్ కమిషనర్ రేట్ పరిధిలో సైబర్ నేరాలపై ఏర్పాటు చేసిన అవగాహన
కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అంజనీకుమార్ మాట్లాడుతూ.. నగర ప్రజలంతా ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తున్నారన్నారు. హైదరాబాద్ ఐదేళ్లుగా వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ‘‘ హైదరాబాద్‌లో శాంతిభద్రతల సమస్య సృష్టికి కొందరు ప్రయత్నిస్తున్నారు. కశ్మీర్‌లో అల్లర్లు జరగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అఫ్గానిస్థాన్, ఇరాక్‌లో జరిగిన పాత ఘటనలను వాట్సాప్‌లో పెడుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని అంజనీకుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీ షికా గోయల్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
* ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు బాధ్యతాయుతంగా పని చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో అర్హులై ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్ససత్యనారాయణ హాజరయ్యారు.
* భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య నియంత్రణాధీన రేఖ (ఎల్‌ఒసి) అత్యంత పవిత్రమైనదని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. అయితే పదేపదే ఇస్లామాబాద్ కనుక కవ్విస్తుంటే ఎల్‌ఒసి దాటి వెళ్లి తగిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని ఆయన అన్నారు. ఒక ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జనరల్ రావత్ 2016 సర్జికల్ స్ట్రైక్స్, 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ మొదలైన అనేక అంశాలను ప్రస్తావించారు.
*చిరంజీవి, పవన్ కళ్యాన్ లు రాజకీయంలో ప్రవేశించి తనలాగే చాలా నష్టపోయారని అమితాబ్ బచ్చన్ చురకలు అంటించారు.
నేడు తెలంగాణా క్యాబినెట్ కీలక భేటి–తాజావార్తలు-09/30
Related tags :