NRI-NRT

జర్మనీ తెలంగాణా సంఘం బతుకమ్మ వేడుకలు

TNILIVE Germany Telugu News | Telangana Association Of Germany TAG Celebrates Batukamma

జర్మనీ తెలంగాణ సంఘం (ట్యాగ్‌) ఆధ్వర్యంలో ఆదివారం బెర్లిన్‌లో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. జర్మనీలోని దాదాపు రెండు వేల కుటుంబాలు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నాయని నిర్వాహకులు తెలిపారు. ట్యాగ్‌ అధ్యక్షుడు చలిగంటి రఘు నేతృత్వంలో ఏర్పాట్లు చేశారు. బెర్లిన్‌లోని బÅారత రాయబార కార్యాలయం టాగూర్‌ కేంద్రం సంచాలకురాలు మాలతీరావు, న్యూకాల్న్‌ ప్రజాప్రతినిధి సుసానా, స్థానిక ఆలయ ప్రతినిధులు జయరాంనాయుడు, విశ్వనాథన్‌ కృష్ణమూర్తి, ట్యాగ్‌ ప్రతినిధులు జీవన్‌రెడ్డి, స్వేచ్ఛారెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు పెద్దఎత్తున బతుకమ్మలను పేర్చి పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం ఉదయం 11 గంటల నుంచి హైదరాబాద్‌ రవీంద్రభారతిలో కవయిత్రుల సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి 316 మంది కవయిత్రులు ఇందులో పాల్గొంటారని, మూడు మందిరాల్లో కవితాగానం చేస్తారని చెప్పారు. ఈ సందర్భంగా బతుకమ్మ కవితా సంకలనాన్ని విడుదల చేస్తామన్నారు.