లండన్‌కు చెందిన యునైటడ్ కింగ్డం తెలుగు సంఘం(UKTA), టెక్సాస్‌కు చెందిన వెన్నం ఫౌండేషన్‌ల ఆధ్వర్యంలో మహాత్ముని 150వ జయంతిని పురస్కరించుకుని వినూత్నంగా గిన్నీస్ రికార్డుతో నివాళులు అర్పించేందుకు సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హైదరబాద్‌కు చెందిన స్వరనిధి సహకారంతో ప్రముఖ సంగీత దర్శకులు స్వరవీణాపాణి చేత నేటి ఉదయం 5గంతలకు లండన్‌లో ప్రారంభమయిన సంగీత విభావరిలో 72 రాగాలాపన అక్టోబర్ 2వ తేదీ వరకు 63 గంటల పాటు నిర్విఘ్నంగా సాగనుంది. ఇందులోని 72 రాగాల్లో అంతరించిపోనున్న 40రాగాలకు ప్రాచుర్యం, పునరుజ్జీవం కలిగించినున్నారు. ఈ గిన్నీస్ రికార్డును మహాత్మునికి నివాళిగా అర్పిస్తామని వెన్నం ఫౌండేషన్ నిర్వాహకులు వెన్నం మురళి తెలిపారు.
మహాత్మునికి UKTA వెన్నం ఫౌండేషన్‌ల వినూత్న నివాళి
Related tags :