DailyDose

టీడీపీకి గుడ్ బై చెప్పనున్న వీరేందర్ గౌడ్-రాజకీయం-09/30

Virender Goud To Leave TDP-Telugu Politics Today-09/30

* త్వరలో టీడీపీ సభ్యత్వానికి, తెలంగాణ తెలుగు యువత అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్న తూళ్ళ వీరేందర్ గౌడ్ బీజేపీ లో చేరనున్న వీరేందర్ గౌడ్.
* శవ రాజకీయాలకు వైసీపీ నిలయం: మాజీ మంత్రి జవహర్‌
శవ రాజకీయాలకు వైసీపీ నిలయమని మాజీ మంత్రి జవహర్‌ పేర్కొన్నారు. నేడు నరసరావుపేటలో మాజీ స్పీకర్ కోడెల సంతాప సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జవహర్ మాట్లాడుతూ.. పావురాల గుట్ట మీద ముక్కలు ఏరుకుంటున్న సమయంలో.. ఇంటి దగ్గర సంతకాలు చేయించుకున్నారన్నారు. టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే కోడెలకు అసలైన నివాళి అన్నారు. సైనెడ్ రుచి చూసినట్లుగా వైసీపీకి ఓటు వేశారని జవహర్‌ పేర్కొన్నారు.
* అందుకే హుజూర్‌నగర్‌లో పోటీ చేయడం లేదు: చాడ
మద్దతు ఇవ్వాలని అందరూ అడుగుతున్నారని.. హుజూర్‌నగర్‌లో పోటీ చేసినా బాగుండేదేమోనని సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్‌తో కలిసి పనిచేశామన్నారు. ఎన్నికలు అంటేనే డబ్బులమయమనిఅందుకే హుజూర్‌నగర్‌లో పోటీ చేయడం లేదని ఆయన అన్నారు. విపక్షాల తరపున అభ్యర్థిని నిలబెడదామని అనుకున్నాం కానీ కుదరలేదన్నారు. బీజేపీకి ముక్కుతాడు వేసేది కమ్యూనిస్టులేనని చాడ వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
* పరిటాలను చంపిన వారు ఎక్కడున్నారో అందరికీ తెలుసు: టీడీపీ మాజీ ఎమ్మెల్యే
గుంటూరు జిల్లా నరసరావుపేటలో టీడీపీ సీనియర్ నేత, దివంగత కోడెల శివప్రసాదరావు సంతాప సభ జరిగింది. ఈ సంతాప సభలో టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పరిటాలను చంపినవారు ఎక్కడ ఉన్నారో అందరికి తెలుసని.. కోడెల మృతికి కారణమైన వారికీ అదే గతి పడుతుందని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలకు కళ్ళు నెత్తికెక్కాయని మాజీ ఎమ్మెల్యే యరపతినేని మండిపడ్డారు.
*పార్లమెంటులో అల్లూరి విగ్రహం: దిగ్విజయ్ సింగ్
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని పార్లమెంట్లో ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్సింగ్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆదివారం జరిగిన జాతీయ క్షత్రియ ఫెడరేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. క్షత్రియులు సేవా తత్పరులని, సేవా మార్గమే పరమావధిగా భావిస్తారని చెప్పారు.
*ఇబ్బందులు నిజమే: బొత్స
‘‘రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఉండటం వాస్తవమే. కారణం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు నిలిపేయడం కాదు. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి తగ్గడం వల్లే ఇబ్బందులు’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరంలో అన్నారు. ఈ సమస్య రెండు మూడు రోజుల్లో సమసిపోతుందన్నారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ-5 చానళ్ల ప్రసారాలు నిలిపివేతను విలేకరులు ప్రస్తావించగా… ‘‘ఎవరు ఆపేశారు? ఆపిన వారినే అడగండి. గతంలో కూడా చానళ్ల నిలుపుదల జరిగింది. తప్పులు చూపిస్తే ఎలా?’’ అంటూ ప్రశ్నించారు. తనపైనా లేనివి చూపించారని అన్నారు.
*వైకాపా, తెదేపాలకు అభివృద్ధి పట్టడంలేదు
రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. వైకాపా, తెదేపాలకు కులం, కుటుంబం, అవినీతి అరాచకాలు తప్ప అభివృద్ధి పట్టడం లేదని విమర్శించారు. విజయవాడలో కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో ఆదివారం పలువురు నేతలు, సీనియర్‌ న్యాయవాదులు, వైద్యులు, సీనియర్‌ జర్నలిస్టులు భాజపాలో చేరారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో అవినీతి రహిత అభివృద్ధి అందించడం భాజపాకే సాధ్యమని చెప్పారు. ప్రధాని మోదీ సమర్థ నాయకత్వాన్ని గుర్తించి మేధావులు, వివిధ పార్టీల నేతలు భాజపాలో చేరుతున్నారని వివరించారు. పార్టీలో చేరిన వారిలో సుప్రీంకోర్టు న్యాయవాది మల్లికార్జునమూర్తి, పలువురు ఏపీ హైకోర్టు న్యాయవాదులు, జనసేన నుంచి డేవిడ్‌రాజు, తెదేపా ఎస్సీ విభాగం నుంచి పలువురు కార్యకర్తలు ఉన్నారు.
*మాంద్యానికి మోదీ పాలనే మూలం: డి.రాజా
దేశంలో ఆర్థికమాంద్యానికి కేంద్రంలో ఉన్న నరేంద్రమోదీ పాలనే కారణమని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆరోపించారు. కటక్‌లో జిల్లా పార్టీ కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు ఆదివారం వచ్చిన రాజా విలేకరులతో మాట్లాడారు. మోదీ పాలనలో చిన్నతరహా పరిశ్రమలు దయనీయ స్థితికి చేరాయని, లక్షలాది మంది కార్మికులు, సిబ్బంది ఉద్యోగాలు కోల్పోతున్నారని అన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని అన్నారు.
*రాజధానికి భూములివ్వడమే రైతుల తప్పా?: కంభంపాటి
రాజధానికి స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులపై జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు ధ్వజమెత్తారు. తెదేపా ప్రభుత్వం వారికి కేటాయించిన ప్లాట్లపై రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రాకుండా ప్రస్తుత సర్కారు మోకాలడ్డుతోందని విమర్శించారు. రాజధానికి భూములు ఇవ్వడమే వారు చేసిన తప్పా? అని ఆదివారం విడుదలచేసిన ఒక ప్రకటనలో నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా తయారైందన్నారు.
*అన్ని జిల్లాల్లో వాహనమిత్ర ప్రదర్శనలు
వైకాపా కార్మిక సంఘం అధ్యక్షుడు గౌతంరెడ్డి
అక్టోబరు 4న వాహనమిత్ర పథకాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఆదివారం నుంచే వారం రోజులపాటు ప్రదర్శనలు, సమావేశాలు, అభినందన సభలు నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి వెల్లడించారు. ఇప్పటికే 1,75,218 మంది దరఖాస్తు చేసుకోగా 1,02,000 వరకు పరిశీలన పూర్తయిందని మిగిలినవి సోమవారం పరిశీలిస్తారన్నారు. వాహన బీమా, ఇతర ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికీ రూ.10 వేలు ప్రభుత్వం ఇస్తోందన్నారు. ఆదివారం వైకాపా కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో రెండు రాష్ట్రాల్లో మాత్రమే సీపీఎస్‌ను రద్దు చేశారని ఆ తరహాలోనే ఏపీలోనూ ఆ విధానాన్ని రద్దు చేసేందుకు జగన్‌ ఉపక్రమించారని గౌతంరెడ్డి వెల్లడించారు.
*ఈ మాత్రానికే కేసా?: లోకేశ్
మీ పాలన పిచ్చోడి చేతిలో రాయు మాదిరి ఉంది’… అన్నందుకే టీడీపీ సీనియ ర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపై కేసు నమోదు చేయడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విస్మయం వ్యక్తం చేశారు. దీనికే కేసు పెడితే… ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉండి ‘రాష్ట్ర ముఖ్యమంత్రిని నడిరోడ్డు మీద కాల్చి చంపాలి’ అని అన్న మిమ్మల్ని ఏం చేయాలి జగన్ గారూ? ఉరి తీయాలా’ అని లోకేశ్ ట్వీట్ చేశారు. ‘‘పాతిక మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచుతానన్న జగన్ గారు కేసుల మాఫీ కోసం నడుం వంచి కాళ్ళు పట్టుకొంటున్నారు. కాని నడిచే ఆస్కారం లేని సామాన్య పౌరుడు ప్రసాద్ మాత్రం ఆంధ్రకి ప్రత్యేక హోదా కోసం ఇచ్ఛాపురం నుంచి అనంతపురం వరకూ ట్రై సైకిల్ యాత్ర పెట్టుకొన్నారు. ప్రసాద్ నిబద్ధతకు, దృఢ సంకల్పానికి జోహార్లు. ఆయన ర్యాలీ చూసి జగన్ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని కేంద్రంతో పోరాడి ప్రత్యేక హోదా తేవాలి. వాల్తేరు డివిజన్తో కూడిన రైల్వే జోన్ సాధించాలని ఆశిద్దామా?’’ అని ట్వీట్ చేశారు.
*కేసీఆర్తో కలిసి శ్రీవారికి పట్టువస్త్ర సమర్పణా?: అశోక్ బాబు
‘‘తిరుమల బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ కేసీఆర్తో కలిసి ఇవ్వటమేంటి? టీటీడీని కూడా తెలంగాణకు కట్టబెట్టే చర్యలు జరుగుతున్నాయా? తెలంగాణ సీఎం చేతిలో ముఖ్యమంత్రి జగన్ కీలుబొమ్మలా మారుతున్నారు’’ అని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబు విమర్శించారు. శుక్రవారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. ఇద్దరి మధ్య ఎంత మిత్రత్వం ఉన్నా రాష్ట్ర హక్కులను పోగొట్టుకోకూడదని సూచించారు. గోదావరి నీటి తరలింపు ఆంధ్ర భూభాగంలోనే జరగాలని డిమాండ్ చేశారు.
*రివర్స్’లో విజయం: అనిల్
దేశంలో మొదటిసారి రివర్స్ టెండరింగ్ విధానం తెచ్చి విజయం సాధించామని జల వనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ చెప్పారు. తాడేపల్లిలో శనివారం మాట్లాడారు. పోలవ రం సాగునీటి ప్రాజెక్టు 65వ ప్యాకేజీ రివర్స్ టెండరింగ్లో రూ.58 కోట్లను ఆదా చేశామని తెలిపారు. ఇప్పటికైనా టీడీపీ తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు. టెండర్ దక్కించుకున్న మ్యాక్స్ ఇన్ఫ్రా సీఎం జగన్కు అనుకూలం కాదని.. చంద్రబాబు హయాంలో 4ు ఎక్కువకు టెండర్ దక్కించుకున్నవాళ్లేనని చెప్పారు. గత ప్రభుత్వంలో కమీషన్లు తీసుకుని ఎక్కువకు టెండర్లు కట్టబెట్టారని.. తమ ప్రభుత్వంలో అలాంటివి లేవన్నారు.
*అందరికీ అవకాశం ఇస్తా: గుత్తా సుఖేందర్రెడ్డి
రాజ్యాంగ విధి, విధానాలకు లోబడి శాసనమండలిలో బాధ్యతలు నిర్వహిస్తానని శానసమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మండలిలో అన్ని పక్షాలు మాట్లాడేందుకు సమాన అవకాశాలు కల్పిస్తానన్నారు. తనను మండలి చైర్మన్గా ఎన్నిక చేసినందుకు కేసీఆర్కు, అన్ని రాజకీయ పక్షాలకు కృతజ్ఞతలు తెలిపారు.
*పాక్ అణ్వాయుధాలను తిప్పికొడతాం: రాజ్నాథ్
పాకిస్థాన్ అణ్వాయుధ దాడిని తిప్పికొట్టేందుకు నౌకాదళం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ అన్నారు. గోవా తీరంలో ఉన్న విమాన వాహక నౌక ఐఎన్ఎ్స విక్రమాదిత్యలో ఆయన నావికా దళాధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ముంబైపై జరిగిన 26/11 తరహా ఉగ్ర దాడులు మళ్లీ జరగకుండా చూసేందుకు సముద్రతీర ప్రాంతాల్లో నౌకాదళం గట్టి పహారా కాస్తోందన్నారు. విక్రమాదిత్యను సముద్రాల రారాజుగా అభివర్ణించారు. ఐఎన్ఎ్స విక్రమాదిత్యపైనే సిబ్బందితో కలిసి రాజ్నాథ్ యోగాసనాలు వేశారు. బ్లాక్ పాంథర్స్గా పేరొందిన భారత నౌకాదళ ఎయిర్ స్క్వాడ్రన్ 303 సభ్యులతో భేటీ అయ్యారు.
* అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఖోన్సా వెస్ట్‌ అసెంబ్లి నియోజక వర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న చకత్‌ అబోహ్‌కు రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతు ప్రకటించాయి. ఎన్‌ఎస్‌సిఎన్‌ (ఐఎం) మిలిటెంట్ల చేతిలో హత్యకు గురైన ఎమ్మెల్యే తిరాంగ్‌ అబోహ్‌ సతీమణి చకత్‌ అబోహ్‌ ఈ నియోజక వర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీనితో అధికార బిజెపి, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్‌, జెడి(యు), ఎన్‌పిపి, పిపిఎలు తమ పార్టీలనుంచి అభ్యర్థిని పోటీకి నిలబెట్టకూడదని ఏకగ్రీవంగా నిర్ణయించాయి. ముఖ్యమంత్రి పేమా ఖండూ అధ్యక్షతన సమావేశమైన ఆ పార్టీల నేతలు ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించారు.
* హైదరాబాద్ నాంపల్లి బిజెపి రాష్ట్ర కార్యాలయం నుండి ..పి బిజెపి వైస్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి కామెంట్స్ ..జ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహారావు తల్లి చనిపోయారు. ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము .వైసీపీ నాయకుల బీజేపి పై చేస్తున్న విమర్శల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.దేశంలో 20 రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ ని ఉప ప్రాంతీయ పార్టీ లైన టీడీపీ, వైసీపీలు విమర్శించడం హాస్యాస్పదం.ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పాలనలానే వైసీపీ పాలన జరుగుతున్నది .పార్టీలు మార్పమాత్రమేకన్నా లక్ష్మీనారాయని రౌడీగా ప్రసన్న కుమార్ సంబోదిస్తారా ?వై.ఎస్.ఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు కదా! మరచిపోయారా?కన్నాగారు 5 సార్లు యం,యల్ ,ఏ గా గెలిచారు. మీలా మేము దిగజారుడు వ్యాఖ్యలు చేయము.అదిమీ దిగజారాడు రాజకీయ సంస్కతి.ప్రభుత్వ వైఫల్యాలపై కన్నా గారి ప్రశ్నలు, ఉత్తరాలకు సమాధానం ఏది?జవాబు ఇవ్వలేక ఆయనమీద వ్యక్తిగతంగా విమర్శించడమా?మీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎందుకు టిడిపి అవినీతిపరులపై చర్యలు తీసుకులేదు?టీడీపీ నేతలు మీ పార్టీ లో చేరితే పునీతలవుతారా?ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ అవినీతిని ప్రశ్నించిన మీరు అధికారంలోకి వచ్చాక ఎందుకు చర్యలు తీసుకోలేదు, కేసులు ఎందుకు నమోదు చేయలేదు?ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ వైసీపీలు లాలూచీ, మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నవి ప్రజలు గమనిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్లో బియ్యం కంటఇసుక రేటు ఎక్కువ .మీ తప్పుల విషయంలో సరిదిద్దుకోకపోతే మేము ప్రజా క్షేత్రంలో పోరాటం చేస్తాము .ఆంద్రప్రదేశ్ లో అవగాహనా లేని ఉపముఖ్యమంత్రులు ఉన్నారు .అంజాద్ బాషా మైనారిటీలకు 4% రిజర్వేషన్ లు ఇస్తామంటున్నారు. రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్ లు ఎలా సాధ్యం?ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులు ఉంటే అణగతొక్కే ప్రయత్నం చేస్తున్నారు .ఆంధ్రప్రదేశ్ కి చెందిన నారాయణ , శ్రీచైతన్య సంస్థలు తెలంగాణాలో దోచుకుంటున్నాయి అని మేమే చెపుతున్నాము .ఆ సంస్థల నుండి కెసిఆర్ కలెక్షన్లుచేసి వసూలు చేస్తు…ఎలక్షన్లు నడిపిస్తాడు.ఆంధ్రప్రదేశ్ లో ప్రమాదంలో చనిపోయిన జర్నలిస్ట్ కి ప్రభుత్వం 25 లక్షల రూపాయల్ని ఇవ్వాలి.ఆంద్రప్రదేశ్ లో ఉద్యోగ కల్పనలో ఒక అడుగు ముందుకేసింది .వాటివిషయంలో రాజకీయాకు అతీతంగ చేయండి.సచివాలయ ఉద్యోగాల ఫలితాలు వచ్చిన తర్వాత గందరగోళం ఏర్పడింది .ఉద్యోగాల ఫలితాల విషయంలో వస్తున్న ఆరోపణలని ప్రభుత్వం నివృత్తి చేయాలి .ఉద్యోగాల భర్తీ విషయంలో నిస్పక్షపాతంగా వ్యవహరించాలి .చంద్రబాబు గ్రామీణ ప్రాంత నిరుద్యోగో వాలంటీర్లను తన స్థాయికి దిగజారి యువకులు ఇళ్ల తలుపులు పడుతున్నారని అవమానం చేశాడు .జగన్ మీద కోపం చంద్రబాబు నిరుద్యోగుల మీద చూపించి లక్షల మందిని అవమానం చేశాడు తక్షణం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు క్షమాపణ చెప్పాలి.
* పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతమైన రామగుండం.. పాలకుల నిర్లక్ష్యంవల్ల అభివృద్ధి చెందడం లేదని విమర్శించారు. పరిశ్రమలు కాపాడి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు.రామగుండం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలని కిషన్‌రెడ్డి సూచించారు.