WorldWonders

పొట్టలోకి 5లీటర్ల బీరు

Doctors Pump 5Liters Beer Into Mans Belly

ఎవరైనా బీరు చల్ల చల్లగా చప్పరిస్తారు. హాయిగా రిలాక్స్ అవుతూ బీరు తాగుతారు. కానీ పొట్టలోకి బీరు పంపటం ఏంటి అనుకుంటున్నారా?. అదీ ఏకంగా ఐదు లీటర్లు. అవును . మీరు చదువుతున్నది నిజం. ఓ పేషంట్ ప్రాణం కాపాడేందుకు డాక్టర్లే స్వయంగా ఈ పనిచేశారు. అది కూలా ఆల్కహాలిక్ పాయిజనింగ్ నుంచి కాపాడేందుకు బీరునే అస్త్రంగా వాడారు. 48 సంవత్సరాల వయస్సు ఉన్న గుయన్ వాన్ అనే వ్యక్తికి ఆల్కహాల్ పాయిజనింగ్ కావటంతో ఆతని రక్తంలో మెథనాల్ స్థాయి ఉండాల్సిన దానికంటే 1,119 రెట్లు ఎక్కువగా ఉంది. మెథనాల్ ను లివర్ ప్రాసెస్ చేసే ప్రక్రియను మందగింపచేసేందుకు ఓ డాక్టర్ల బృందం తొలుత ఒక లీటర్ బీరును గుయన్ వాన్ పొట్టలోకి పంపారు. అలా వివిధ దశల్లో మొత్తం ఐదు లీటర్ల బీర్ ను పంపి వైద్యం చేశారు. ఇలా చేసిన తర్వాత బాధితుడు కోమా నుంచి సృహలోకి వచ్చాడు. అయితే ఇలా శరీరంలోకి బీరును పంపి వైద్యం చేయటం అసాధారం అని చెబుతున్నారు. ఇలా వైద్యం దక్కించుకున్న బాధితుడు మూడు వారాల తర్వాత ఆస్పత్రి నుంచి హాయిగా ఇంటికెళ్లిపోయాడు. ఈ ఫీట్ చేసింది వియత్నాం డాక్టర్లు. ఈ విషయాలను ‘డెయిలీ మెయిల్’ పత్రిక వెల్లడించింది. ఎంతైనా బీరుతో వైద్యం చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు గ్రేట్. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. డాక్టర్లు వైద్యానికి బీరు వాడారు కదా?. రెచ్చిపోమాకండి మందుబాబులూ.