మహాత్మాగాంధీ మెమోరియల్ అఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యం లో అక్టోబర్ 6 వ తేదీ, ఆదివారం ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు ఇర్వింగ్ లోని మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా (1201 హిడెన్ రిడ్జ్ డ్రైవ్, ఇర్వింగ్, టెక్సాస్) వద్ద మహాత్మాగాంధీ 150 వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ఈ వేడుకలకు టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ ముఖ్య అతిధి గా విచ్చేసి మహాత్మాగాంధీకి నివాళులర్పించి ప్రసంగిస్తారని, ఇర్వింగ్ పట్టణ మేయర్ రిక్ స్టాప్ఫేర్, టెక్సాస్ రాష్ట్ర ప్రతినిధి జూలీ జాన్సన్, డిప్యూటీ కాన్సల్ జనరల్ అఫ్ ఇండియా సురేంద్ర అదానా ప్రత్యేక అతిధులుగా హాజరవుతున్నారని తెలిపారు. అనంతరం 15 శాంతి కపోతాలను విడుదల చేసి, ఇండియా అసోసియేషన్ అఫ్ నార్త్ టెక్సాస్ అధ్వర్యంలో “గాంధి శాంతి యాత్ర” నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకకు అందరూ ఆహ్వానితులేనని ప్రసాద్ తెలిపారు. గాంధీ మెమోరియల్ బోర్డు సభ్యులు – డా. ప్రసాద్ తోటకూర, బి. ఎన్. రావు, జాన్ హామేండ్, రావు కల్వాల, టయాబ్ కుండావాల, పియూష్ పటేల్, అక్రం సయెద్, కమల్ కౌశిల్ , అభిజిత్ రాయల్కర్ మరియు ఆహ్వ్వన కమిటీ సభ్యులు – మురళి వెన్నం, రన్నా జాని, ఆనంద్ దాసరి, డా. సత్ గుప్తా, శ్రీకాంత్ పోలవరపు, శ్రీధర్ తుమ్మల, షబ్నం మోడ్గిల్, గుత్తా వెంకట్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని వివరాలకు www.mgmnt.orgను చూడవచ్చు.
ఇర్వింగ్‌లో మహాత్ముని 150వ జయంతి వేడుకలు
Related tags :