మాజీ ఎంపీ , సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ సర్క్జారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా ఆయన మౌనంగా ఉంటూ వచ్చారు. మంగళవారం నాడు మీడియా ముందుకు వచ్చి పలు అంశాలను ప్రస్తావించారు. విద్యుత్ కోతలు జగన్ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చయన్నారు. విద్యుత్ కోట్లకు కారణం బొగ్గు అనో లేక గత ప్రభుత్వం అనో చెపితే ప్రజలు అంగీకరించారని అన్నారు. తమకు విద్యుత్ వస్తుందా? లేదా అన్నదే ప్రజలు చూస్తారు తప్ప ప్రభుత్వ వివరణలు కాదన్నారు. 151 సీట్లు, 51 శాతం ఓట్లు శాశ్వతమని జగన్ అనుకోవద్దని సూచించారు. 1972లో 51శాతం ఓట్లు, 220సీట్లు సాధించిన పీవీ నరసింహారావు 9 నెలలకే దింపేశారు. 1994 లో 54 శాతం ఓట్లు 223 సీట్లు సాధించిన ఎన్టీఆర్ నూ అదే 9నెలలకు దింపేశారు. అసలు ఎన్టీఆర్ ను చంద్రబాబు పదవిలో నుంచి దిమ్పెస్తారని ఎవరైనా ఊహించారా? అని ప్రశ్నించారు. ప్రజలే కాదు తమతో పాటు గెలిచినా పార్టీ ఎమ్మెల్యేలను జగన్ సంతృప్తి పరచాలి ముఖ్యమంత్రి మాట వింటున్నారని తమకు గౌరవం ఇస్తున్నారని ఎమ్మెల్యేలు భావించేలా జగన్ చూసుకోవాల్సి ఉంటుందని అన్నారు. నవరత్నాలలో ఒకటి తేడా వచ్చినా జగన్ మనుషులే తిరగబడతారు. ఎన్టీఆర్ గెలిపించుకున్న ఎమ్మెల్యేలే ఆయనపై తిరుగుబాటు చేశారు. ఇన్ని సీట్లు ఇంత ఓట్ల శతం సాధించడం జగన్ స్వయం కృషే అని అందులో అనుమానం ఎమీలేదన్నారు. అయితే నాయకుడు అనే వాడు గతంలో జరిగిన తప్పులను పునరావృతం కాకుండా చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు.
జగన్ ప్రభుత్వాన్ని కూడా పడగొడతారేమో!
Related tags :