లాస్ ఏంజిల్స్ ఎన్నారై తెదేపా ఆద్వర్యంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్, చిత్తూరు మాజీ ఎంపీ నారమిల్లి శివప్రసాదరావుల మృతికి నివాళులు అర్పించారు. స్థానిక ప్రవాస ప్రముఖుడు కామినేని శరత్ గృహంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇరువురు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కొంకా శ్రీహరి, మాలిన కృష్ణకిషోర్, డా. ఆలపాటి రవి, నెక్కంటి విజయభాస్కర్, వాసిరెడ్డి రాహుల్, తదితరులు పాల్గొన్నారు.
లాస్ఏంజిల్స్‌లో కోడెల, శివప్రసాద్‌లకు నివాళి
Related tags :