DailyDose

మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో ముగిసిన వాదనలు–రాజకీయ-10/01

Muncipal Elections Hearing Done In High Court | Telugu Political News Today-10/01

* తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలపై హైకోర్టులో వాదనలు పూర్తి . ఎన్నికలకు ముందు జరిగే ప్రక్రియను ర్వహించుకోవచ్చన్న కోర్టు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయొద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం తుది తీర్పునకు లోబడే ఎన్నికల నోటిఫికేషన్‌ ఉంటుందన్న హైకోర్టు.
*రాష్ట్రావతరణను ప్రభుత్వం అధికారికంగా జరపాలి: తులసీరెడ్డి
ఆంధ్రా మేధావుల ఫోరం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నేడు జరిగింది. అక్టోబర్‌ 1న రాష్ట్రావతరణ దినోత్సవం జరపాలని ప్రభుత్వాన్ని కోరామని ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ తెలిపారు. త్యాగాల పునాదిపై ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసీరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రావతరణను ప్రభుత్వం అధికారికంగా జరపాలన్నారు.
*వైసీపీ నేతలు ఇలానే దాడులు చేస్తే..: సోమిరెడ్డి
కావలిలో వైసీపీ శ్రేణులు చేసిన దాడిలో గాయపడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఆ పార్టీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆస్పత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలు ఇలానే దాడులు చేస్తే.. చూస్తూ ఊరుకునేది లేదని.. ప్రతి దాడులు చేస్తామని హెచ్చరించారు. సోమిరెడ్డితోపాటు, బీద రవిచంద్ర, స్థానిక కార్యకర్తలు బాధితులను పరామర్శించారు.
*జగన్‌ అప్రమత్తంగా ఉండాలి: ఉండవల్లి
కశ్మీర్‌లో రెండు నెలలుగా కర్ఫ్యూ కొనసాగడం బాధాకరమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. పరిపాలనలో జగన్‌ అప్రమత్తంగా ఉండాలన్నారు.పోలవరం రివర్స్‌ టెండరింగ్‌లో ఇన్ని కోట్లు ఆదా అవుతాయని ఊహించలేదన్నారు. విద్యుత్‌ కోతలు ఎక్కువైతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఉండవల్లి వ్యాఖ్యానించారు.
*బిజెపి కన్నా కామెంట్స్.
సభత్వ నమోదు కార్యక్రమం డ్రైవ్ పూర్తయింది.తర్వాత కూడా సభ్యత్వం నమోదవుతోంది.7.5లక్షల సభ్యత్వ నమోదయింది.మోదీ పట్ల ప్రజల్లో రోజు రోజుకు పెరుగుతోంది.ప్రపంచం మొత్తం మోడి వైపు చూస్తోంది.చరిత్రలో మోడి,అమిత్ షా శాశ్వతంగా నిలిచిపోతారు.ఒక్క రక్తం బొట్టు కూడా రాలకుండా సమస్యకు పరిష్కారం కనుగొన్నారు.దేశ ప్రతిష్ట ను పెంచారు.2019 నుండి పార్టీలో అనేకమంది చేరుతున్నారు.దళితులు‌,మైనార్టీ లు ఎక్కువ మంది చేరుతున్నారు.ప్రభుత్వానికి ఆరు నెలల సమయమివ్వాలనుకున్నాం.ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధి కుంటు పడేలా ఉన్నాయి.టిడిపి ఆర్థిక పరిస్థితి ని చిన్నాభిన్నాం చేసింది.
*4 నుంచి రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ రణభేరి: కన్నా
‘‘రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, వైఫల్యాల మీద రణభేరి మోగిస్తున్నాం. అక్టోబర్ 4 నుంచి వరుస నిరసనలతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై గాంధేయవాద పద్ధతిలో పోరాటం చేయబోతున్నాం’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వ విధానం వల్ల ఇసుక బ్లాకులో మాత్రమే లభిస్తోందన్నారు. ఇసుకను ఆపేయడం వల్ల లక్షలాది మంది భవన నిర్మాణ కూలీలు ఆకలితో అలమటిస్తున్నారన్నారు. కూలీలతో కలిసి ఈ నెల 7న బీజేపీ బిక్షాటన చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను జగన్ ప్రభుత్వం ఎందుకు అమలుచేయడం లేదని కన్నా ప్రశ్నించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీలో అభాసుపాలైన జగన్ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయకుండా వేలాది మంది అవకాశాలకు గండి కొట్టిందని మండిపడ్డారు.
*ఇబ్బందులు నిజమే: బొత్స
‘‘రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఉండటం వాస్తవమే. కారణం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు నిలిపేయడం కాదు. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి తగ్గడం వల్లే ఇబ్బందులు’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరంలో అన్నారు. ఈ సమస్య రెండు మూడు రోజుల్లో సమసిపోతుందన్నారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ-5 చానళ్ల ప్రసారాలు నిలిపివేతను విలేకరులు ప్రస్తావించగా… ‘‘ఎవరు ఆపేశారు? ఆపిన వారినే అడగండి. గతంలో కూడా చానళ్ల నిలుపుదల జరిగింది. తప్పులు చూపిస్తే ఎలా?’’ అంటూ ప్రశ్నించారు. తనపైనా లేనివి చూపించారని అన్నారు. అభివృద్ధి చేస్తుంటే చేయలేదని చెప్పటం సరికాదన్నారు.
*కమీషన్లపైనే టీడీపీ దృష్టి: విజయసాయిరెడ్డి
‘‘టీడీపీ ప్రభుత్వం ప్రాజెక్టు కమీషన్లపైనే దృష్టి పెట్టింది. ప్రజా సంక్షేమం వారికి పట్టలేదు. పోలవరంలో రివర్స్ టెండరింగ్తో ఆంధ్ర సీఎం రూ.780 కోట్లు ఆదా చేశారు’’ అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్లో పేర్కొన్నారు. ‘‘కిలోమీటర్ల లెక్కన లీజుకు తీసుకునే ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణతో ఆర్టీసీకి ఏం సంబంధం చంద్రబాబు గారూ. దానికి ఒప్పుకోనందుకే మీరు నియమించిన సురేంద్రబాబుని బదిలీ చేశారని దిక్కుమాలిన వాదన చేస్తున్నారు. హైర్ బస్సుల నిర్వహణ ఎక్కడైనా వాటి యాజమాన్యాలే చేస్తాయి కదా?’’ అని ఓ ట్వీట్లో ప్రశ్నించారు.
*కేసీఆర్తో కలిసి శ్రీవారికి పట్టువస్త్ర సమర్పణా?: అశోక్ బాబు
‘‘తిరుమల బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ కేసీఆర్తో కలిసి ఇవ్వటమేంటి? టీటీడీని కూడా తెలంగాణకు కట్టబెట్టే చర్యలు జరుగుతున్నాయా? తెలంగాణ సీఎం చేతిలో ముఖ్యమంత్రి జగన్ కీలుబొమ్మలా మారుతున్నారు’’ అని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబు విమర్శించారు. శుక్రవారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. ఇద్దరి మధ్య ఎంత మిత్రత్వం ఉన్నా రాష్ట్ర హక్కులను పోగొట్టుకోకూడదని సూచించారు. గోదావరి నీటి తరలింపు ఆంధ్ర భూభాగంలోనే జరగాలని డిమాండ్ చేశారు.
*కేంద్రమంత్రి కిషన్రెడ్డితో ఎంపీ గల్లా భేటీ
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డితో ఏపీ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి భూమా అఖిలప్రియలు విడివిడిగా సమావేశమయ్యారు. శనివారం, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లోని కిషన్రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీలు జరిగాయి. ఏపీ మాజీ స్పీకర్, దివంగత నేత కోడెల శివప్రసాదరావుపై జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులపై జయదేవ్, కేంద్ర మంత్రికి వివరించగా, కర్నూలు జిల్లాలో రాజకీయ దాడులపై అఖిలప్రియ ఫిర్యాదు చేసినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.
*వేతనాల పెంపు ఉత్తర్వులివ్వండి: జీవన్రెడ్డి
గ్రామ పంచాయతీల పరిధిలోని పారిశుధ్య కార్మికుల వేతనాల పెంపునకు సంబంధించి ఉత్తర్వులు వెంటనే జారీ చేయాలని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. అక్టోబరు నుంచే పెంచిన వేతనం అందజేయాలని సీఎం కేసీఆర్కు సోమవారం ఆయన లేఖ రాశారు.కార్మికుల వేతనాన్ని రూ.8500కు పెంచడం సంతోషమేనని, అయితే ఉత్తర్వులు జారీ కాకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
*పోలీసుల అధికార దుర్వినియోగం: కోదండ
హుజూర్నగర్ ఉప ఎన్నికలో పోలీసుల అధికారాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. నామినేషన్ వేసేందుకు వెళ్లిన సర్పంచులను హుజూర్నగర్ చేరుకోకముందే అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా తెలంగాణ నవనిర్మాణ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, పాలిటెక్నిక్ జేఏసీ కన్వీనర్ మల్యాల మురళీధర్ గుప్తా సోమవారం కోదండరాం సమక్షంలో టీజేఎ్సలో చేరారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని నిరంకుశ పాలననుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, అందుకే తాను పదేళ్ల ప్రభుత్వ సర్వీసును వదులుకొని టీజేఎస్లో చేరానని మురళీధర్ గుప్తా అన్నారు