* ఇండియాలో బ్యాంకు స్కాములు ఆగకుండా సాగుతునాయి. ఇంకా చెడు వార్తలు ఉండవేమో అనుకునేంతలోనే వేలకోట్ల రూపాయల బ్యాంకు స్కాము బయటపడింది. ఇప్పటిదాకా జరిగిన బ్యాంకు స్కాములు ఒక ఎత్తయితే తాజాగా పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకులో స్కాము మరో ఎత్తు తీవ్రమైన ఇబ్బందుల్లో ఇండియా ఫైనాన్షియల్ సిస్టమ్స్ ఈ స్కాము మరో కుద్పు కుదిపింది. ఈ నేపద్యంలో వ్యవస్థను కాపాడుకునేందుకు తగిన చర్యలు తీసుకోవడం తప్పనిసరైంది.
*అక్టోబరు 1 (మంగళవారం) నుంచి బ్యాంకుల వేళలు మారనున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ ఇకపై ఒకేరకమైన సమయ పాలనను పాటించనున్నాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకే పనిచేయనున్నాయి. మధ్యాహ్నం 2.00-2.30 గంటల మధ్య బ్యాంకు ఉద్యోగులకు భోజన విరామం ఉంటుంది. ఈ మేరకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీలో సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో.. ప్రతి ఆదివారం, రెండు, నాలుగు శనివారాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
*రియల్టీ కంపెనీ హెచ్డీఐఎల్ ఎండీ సారంగ్ వాదవాన్, హోల్టైమ్ డైరెక్టర్ రాకేశ్ కుమార్ వాదవాన్లపై ప్రభుత్వం లుకవుట్ నోటీసులు జారీ చేసింది.
*ఆర్థిక వ్యవస్థ మందగమనం కారణంగా.. రెపో రేట్లను భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మరింతగా తగ్గించనుందని గోల్డ్మన్ శాక్స్ అంచనా వేసిం ది. రెపో రేట్లపై ఈ నెలలో 0.25 శాతం, డిసెంబరులో మరో 0.25 శాతం తగ్గించే అవకాశముందని పేర్కొం ది.
*వర్తమాన ఆర్థిక సంవత్సరంలో వాస్తవ వృద్ధిరేటు 5.2 శాతానికే పరిమితం అవుతుందని ఆర్థిక గూఢచర్య విభాగం (ఈఐయూ) అంచనా వేసింది. ప్రస్తుతం దేశంలో వ్యాపార విశ్వాసంలో అస్థిరతలు, వస్తు సేవల డిమాండులో క్షీణత. ఆర్థిక రంగంపై ఆందోళనతో పెట్టుబడుల పట్ల నెలకొన్న నిరాసక్తత వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ తాజా అంచనా ప్రకటించింది. రెండో త్రైమాసికంలో వాస్తవ వార్షిక జీడీపీ వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్ఠ స్థాయి 5 శాతానికి దిగజారిందని, అయితే మూడో త్రైమాసికం గణాంకాల్లో స్వల్ప మెరుగుదల కనిపించిందని ఆ విభాగం తెలిపింది.
*భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) సహా నాలుగు ప్రభుత్వ రంగ సంస్థ(పీఎ్సయూ)ల్లో కేంద్రం తనకున్న మొత్తం వాటాను విక్రయించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు డిజిన్వె్స్టమెంట్ కార్యదర్శుల బృందం సోమవారం ఆమోదం తెలిపినట్లు సమాచారం.
ఒక కంపేనీ బ్యాంకుని ముంచేసింది-వాణిజ్యం-10/01
Related tags :