Business

హైదరాబాద్‌లొ ఢమాల్ అన్న రియల్ ఎస్టేట్

Real Estate Down By 18% In Hyderabad | Telugu Business News

హైదరాబాద్‌లో గృహాల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది జులై– సెప్టెంబర్‌ త్రైమాసికంలో నగరంలో 3,280 గృహాలు విక్రయమయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 32 శాతం తక్కువని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నివేదిక తెలిపింది. సబ్‌ వెన్షన్‌ స్కీమ్‌ రద్దు, మార్కెట్‌ సెంటిమెంట్, ఆర్ధిక మందగమనం వంటి కారణాల వల్ల విక్రయాలు తగ్గాయని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెన్సీ చైర్మన్‌ అనూజ్‌ పూరీ తెలిపారు.
**దేశవ్యాప్తంగా 18 శాతం డౌన్‌
దేశంలోని ఏడు ప్రధాన నగరాలైన ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, పుణే, హైదరాబాద్‌లల్లో 2018 క్యూ3లో 67,140 గృహాలు అమ్ముడుపోగా.. ఈ ఏడాది క్యూ3 నాటికి 18 శాతం క్షీణించి 55,080 యూనిట్లకు తగ్గాయి. 2019 క్యూ2తో పోలిస్తే ఇది 20 శాతం తక్కువ. నగరాల వారీగా క్షీణత గణాంకాలు చూస్తే.. బెంగళూరులో అత్యధికంగా 35 శాతం విక్రయాలు తగ్గాయి. 2019 క్యూ3లో 10,500 యూనిట్లు అమ్ముడుపోయాయి. కోల్‌కతాలో 27 శాతం క్షీణించి, 3,120 యూనిట్లకు, ఎన్‌సీఆర్‌లో 13 శాతం క్షీణతతో 9,830 యూనిట్లు, చెన్నైలో 11 శాతం క్షీణించి.. 2,620 యూనిట్లు, పుణేలో 8 శాతం 8,550 యూనిట్లు, ముంబైలో 6 శాతం క్షీణించి, 17,180 యూనిట్లు విక్రయమయ్యాయి.
**తగ్గిన ఇన్వెంటరీ
2019 జూన్‌ త్రైమాసికం ముగిసే నాటికి ఏడు ప్రధాన నగరాల్లో అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) 6.66 లక్షల యూనిట్లుండగా.. జులై– సెప్టెంబర్‌ త్రైమాసికం నాటికి 6.56 లక్షల యూనిట్లకు తగ్గాయి.