Food

కుంకుమపువ్వు తింటే…

Saffron Based Diet Is Good For Heart | Telugu Food News Recipes

అత్యంత ఖరీదైన సుగంధద్రవ్యం కుంకుమపువ్వు. అంతే మెరుగైన పోషకాలూ ఈ పువ్వులో ఉంటాయి. ఈ పువ్వు వాడకం వల్ల ఒరిగే ఆరోగ్య ప్రయోజనాలకూ కొదవ లేదు.
*మనసు ఉల్లాసం
సెరటోనిన్ హార్మోన్ను సమ స్థాయిలో విడుదల చేసేలా కుంకుమపువ్వు మెదడును ప్రభావితం చేస్తుంది. ఆనందం కలగడంలో కీలక పాత్ర పోషించే ఈ హ్యాపీ హార్మోన్ స్రావం మెరుగ్గా ఉండడం కోసం కెరోటినాయిడ్లు, బి విటమిన్ పుష్కలంగా ఉండే కుంకుమపువ్వును ఆహారంలో చేర్చుకుంటూ ఉండాలి.
*రోగనిరోధకశక్తి
దీనిలోని కెరోటిన్స్, జీగ్జాంథిన్, లైకోపిన్లు ఇన్ఫెక్షన్ల నుంచి శరీరానికి రక్షణ కల్పిస్తాయి. క్రమం తప్పక కుంకుమపువ్వును తీసుకునేవాళ్లకు కేన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు పరిశోధన్లో తేలింది.
*గుండె ఆరోగ్యం
ఈ పువ్వులోని పొటాషియం, విటమిన్ సి రక్తపోటును నియంత్రించి గుండెకు రక్షణ కల్పిస్తాయి. గుండె సంబంధ జబ్బుల బారిన పడే అవకాశాలను కుంకుమపువ్వు తగ్గిస్తుంది.