DailyDose

కేసీఆర్‌కు తెలంగాణా హైకోర్టు ఝలక్-తాజావార్తలు-10/01

Telangana HighCourt Summons KCR | Telugu Breaking News-10/01

* సచివాలయం కూల్చివేతకు నో చెప్పిన హైకోర్టు భవనాలను కూల్చివేయొద్దన్న ధర్మాసనం దసరా సెలవుల తర్వాత చారణ చేపడతామన్న హైకోర్టు తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలపై హైకోర్టులో వాదనలు పూర్తి ఎన్నికలకు ముందు జరిగే ప్రక్రియను నిర్వహించుకోవచ్చన్న కోర్టు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయొద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
తుది తీర్పునకు లోబడే ఎన్నికల నోటిఫికేషన్‌ ఉంటుందన్న హైకోర్టు.
* ఇంద్రకీలాద్రి పై దసరా ఫెస్టివల్ కమిటీలో మరో అరుగురికి స్ధానం తాజాగా ఆరుగురితో 42 కు చెరిన ఉత్సవ కమిటీ సబ్యుల సంఖ్య ఉత్సవ కమిటీలొ ముగ్గురు మహిళలకు చోటు.
* దేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళవారం భారీవర్షాలు కురవవచ్చని ఢిల్లీలోని కేంద్ర వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్‌, సిక్కిం, నాగాలాండ్‌, మణిపూర్‌, మిజోరం, త్రిపుర, గుజరాత్‌, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ ప్రాంతాల్లో మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణశాఖ హెచ్చరించింది. మత్స్యకారులు మంగళవారం సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు కోరారు.
* ఇవాళ లోక్‌సభ మాజీ స్పీకర్‌ బాలయోగి జయంతి సందర్భంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. బాలయోగి తనకు అత్యంత ఆత్మీయుడు అని పేర్కొన్నారు. సామాన్య దళిత రైతు కుటుంబంలో జన్మించిన బాలయోగి.. లోక్‌సభ స్పీకర్‌ స్థాయికి ఎదిగారని కొనియాడారు.
* ఖమ్మం జిల్లా కారేపల్లిలో ఓ తల్లి తన కుమార్తెకు నరకం చూపించింది. కేవలం రెండు రూపాయలు తీసుకుందన్న కోపంతో కర్రు కాల్చి వాతపెట్టింది. నొప్పికి తాళలేక చిన్నారి ఏడుస్తుంటే చుట్టుపక్కల వారు పరిగెత్తుకు రావడంతో విషయం బయటపడింది. మండలంలోని పేరుపల్లికి చెందిన ఓ మహిళ తన పదేళ్ల కూతురిని చిత్రహింసలకు గురిచేసింది. రెండు రూపాయలు తీసుకుందన్న కోపంతో కట్టెల పొయ్యిలో మండుతున్న కర్ర తీసి అరచేతిపైనా, ఒంటిపైనా వాతలుపెట్టింది.
* జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వద్ద పాక్ సైనికులు మరోసారి కాల్పులు జరిపారు. బాలాకోట్ పై భారత వాయుసేన దాడుల అనంతరం పాక్ ఆర్మీ పలుసార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. జమ్మూకశ్మీర్ లోని పూంచ్ జిల్లా మెంధార్, బాలాకోటి సెక్టార్లలో పాక్ సైనికులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు పౌరులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేపిస్తున్నారు.
* అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాజిక్యూటర్‌(ఏపీపీ) పోస్టులు భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 50 పోస్టుల భర్తీకి రాష్ట్రస్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటన విడుదల చేసింది.
* విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి మాటలకు ద్రోణంరాజు ఘాటుగా స్పందించారు. సభా మర్యాదలను పాటించాలని.. చిన్నా పెద్దా తేడా తెలుసుకోవాలని మంత్రికి సూచించారు.
* గోదావరిలో మునిగిన పర్యాటక బోటు వెలికితీత ప్రయత్నాలు తొలి రోజు విఫలమైంది. కాకినాడకు చెందిన మత్స్యకార నిపుణుడు ధర్మాడి సత్యం బృందం బోటును వెలికి తీసేందుకు తీవ్రంగా శ్రమించింది. బోటు ఉన్న ప్రాంతంలో సుడిగుండాలు ఉండటంవల్ల… తొలిరోజు ప్రయత్నాలు అంతగా ఫలించలేదు. కళ్ల ఎదురుగా మునిగిపోయిన బోటు బయటకు వస్తే చూసేందుకు గిరిజన వాసులు తరలివచ్చారు.
* ఉత్తర్ప్రదేశ్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వర్షాల కారణంగా… గత ఐదు రోజుల్లో ఇప్పటివరకు 111 మంది మృతి చెందారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. విపత్తు స్పందన బృందాలు రంగంలోకి దిగి ముంపునకు గురైన ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. బాలియా జిల్లా కారాగారం బ్యారక్‌లలోకి వరదనీరు ప్రవేశించడం వల్ల 900 మంది ఖైదీలను మిగతా జైళ్లకు తరలించారు.
* పట్నాలోని రాజేంద్ర నగర్‌లో సుమారు 5 అడుగుల మేర వరద నీరు నిలిచిపోయింది. నగరంలోని గాంధీ మైదానం, దాని పరిసర ప్రాంతాలు.. పూర్తిగా వరద నీటితో నిండిపోయాయి.
* భారీ వర్షాలతో బిహార్ వణికిపోతోంది. వర్షాల కారణంగా మరణించినవారి సంఖ్య 28కి చేరింది. గురువారం నుంచి కురుస్తోన్న వర్షాలకు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పడవల్లోనే ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి నెలకొంది.
* కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలకు బిహార్, ఉత్తర్ప్రదేశ్ సహా ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. జనజీవనం స్తంభించిపోయింది. గత ఐదు రోజుల్లోనే.. యూపీ, బిహార్‌ సహా మిగతా రాష్ట్రాల్లో మొత్తం 148 మంది మృతి చెందారు.ఉత్తర్ప్రదేశ్లో అత్యధికంగా 111 మంది ప్రాణాలు కోల్పోయారు. బిహార్ రాష్ట్రంలో 28 మృతి చెందారు.
* జేఈఈ మెయిన్స్‌ పరీక్ష దరఖాస్తు గడువును సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 10కి పొడిగిస్తూ జాతీయ పరీక్షా సంస్థ(ఎన్‌టీఏ) నిర్ణయం తీసుకుంది. అయితే 11న ఉదయం 11.50 గంటల వరకు ఫీజులు చెల్లించవచ్చని వెల్లడించింది. దరఖాస్తుల్లో దొర్లిన తప్పుల దిద్దుబాటుకు 14 నుంచి 20 వరకు అభ్యర్థులకు అవకాశం కల్పించింది. జనవరి 6 నుంచి 11 వరకు జేఈఈ మెయిన్స్‌ పరీక్ష జరగనుండగా, అదే నెల 31న ఫలితాలు వెలువడతాయి.
* హింసను ప్రోత్సహించే విధంగా ఉన్న పబ్జీ మొబైల్ క్రీడను నిషేధించాలని అభ్యర్థిస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. విశాఖలో నిర్వహించనున్న ‘పబ్జీ మెుబైల్ ఇండియా టూర్-2019’ కార్యక్రమానికి అనుమతి తీసుకున్నారా? అని ఏపీ హోంశాఖను ధర్మాసనం ప్రశ్నించింది.అక్టోబర్ 6న విశాఖపట్నంలో నిర్వహించనున్న ‘ పబ్జీ మొబైల్ ఇండియా టూర్ – 2019’ను నిలువరించాలని హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది.
* ఈ ఏడాది రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ), స్కైమేట్‌ వంటి ప్రైవేటు సంస్థల అంచనాలు తప్పాయి. అంతకు మించి వర్షాలు కురిశాయి. రుతుపవనాలు రికార్డులను సృష్టించాయి.
* నవంబర్లో నిర్వహించబోయే కర్తార్‌పుర్‌ నడవా ప్రారంభోత్సవానికి భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ను ఆహ్వానించాలని పాకిస్థాన్‌ నిర్ణయించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి ఓ వీడియో సందేశంలో వెల్లడించారు. త్వరలోనే మన్మోహన్‌కు ఆహ్వాన పత్రికను పంపించబోతున్నట్లు తెలిపారు. గురునానక్‌ 550వ జయంతి వేడుకలకు విచ్చేసే సిక్కులను సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు ఖురేషి పేర్కొన్నారు.
* ఎస్సీ ఎస్టీ చట్టం కింద అరెస్ట్ చేసే నియమాలను నీరుగార్చుతోన్న 2018 తీర్పును పునఃసమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై నేడు సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. కేంద్ర ప్రభుత్వ పిటిషన్ను సుమారు 18 నెలల అనంతరం ఈ ఏడాది సెప్టెంబర్ 13న త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేసింది సుప్రీం కోర్టు.సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీఆర్ గవాయ్ల త్రిసభ్య ధర్మాసనం నేడు విచారణ చేపట్టనుంది.
* మద్యం దుకాణాలతో ఏవైనా సమస్యలు తలెత్తితే ప్రజలు నేరుగా గ్రామ సచివాలయాల్లోని మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయోచ్చు.జూన్ నుంచి ఇప్పటివరకూ మద్యం విక్రయాలు 15 శాతం మేర తగ్గినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
* మద్యనిషేధం అమల్లో భాగంగా…. మద్యం బాటిళ్లపై ఎఆర్ఈటీ పేరిట అదనపు చిల్లర ఎక్సైజ్‌ పన్నును ప్రభుత్వం విధించింది.దేశీయంగా తయారైన విదేశీ మద్యం, బీర్, వైన్ ఇతర వెరైటీలపై పన్ను విధించారు.
* ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4 వేల 380 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటిలో 20 శాతం తగ్గించి 3 వేల 500 దుకాణాలు నడపాలని నిర్ణయించింది. గత నెలలోనే ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా 475 దుకాణాలను ప్రభుత్వం ప్రారంభించింది. 3 వేల 448 షాపుల కోసం గదులను… టెండర్ల ద్వారా అద్దెకు తీసుకున్నారు.
* దశల వారీ మద్య నిషేధంపై రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగువేసింది. నూతన మద్యం విధానం అమల్లోకి తెచ్చింది. స్వదేశీ, విదేశీ మద్యం సీసాలపై వాటి పరిమాణాన్ని బట్టి కనిష్ఠంగా రూ.10 నుంచి గరిష్ఠంగా 250 వరకూ పెంచింది.ప్రైవేటు మద్యం దుకాణాల లైసెన్స్‌ ముగియడంతో… ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం అమ్మకాలు సాగనున్నాయి
*దశల వారీ మద్య నిషేధంపై రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగువేసింది. నూతన మద్యం విధానం అమల్లోకి తెచ్చింది. స్వదేశీ, విదేశీ మద్యం సీసాలపై వాటి పరిమాణాన్ని బట్టి కనిష్ఠంగా రూ.10 నుంచి గరిష్ఠంగా 250 వరకూ పెంచింది.ప్రైవేటు మద్యం దుకాణాల లైసెన్స్‌ ముగియడంతో… ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం అమ్మకాలు సాగనున్నాయి.
*భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య బుధవారం నుంచి జరిగే తొలి టెస్టు సజావుగా సాగడం సందేహంగానే మారింది. ఎందుకంటే ఆట జరిగే ఐదు రోజులూ వర్షం ఆటంకపరచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నిజానికి గత ఐదు రోజుల నుంచి ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మ్యాచ్ తొలి రోజు కూడా 80శాతం వర్షానికి చాన్స్ ఉండడం అభిమానులను ఆందోళనపరుస్తోంది.
*ప్రాథమిక విద్య నాణ్యతాప్రమాణాల్లో తెలంగాణ రాష్ట్రం వెనకంజలో ఉంది. వివిధ ప్రామాణికాల ఆధారంగా రాష్ట్రాలకు నీతీ ఆయోగ్ ప్రకటించిన ర్యాంకుల్లో తెలంగాణ 18వ స్థానంలో నిలిచింది. నీతీ ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్కుమార్, సీఈవో అమితాబ్ కాంత్, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి రీనారే సోమవారం ఈ సూచిని విడుదల చేశారు.
*జేఈఈ మెయిన్స్ పరీక్ష దరఖాస్తు గడువును సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 10కి పొడిగిస్తూ జాతీయ పరీక్షా సంస్థ(ఎన్టీఏ) నిర్ణయం తీసుకుంది. అయితే 11న ఉదయం 11.50 గంటల వరకు ఫీజులు చెల్లించవచ్చని వెల్లడించింది. దరఖాస్తుల్లో దొర్లిన తప్పుల దిద్దుబాటుకు 14 నుంచి 20 వరకు అభ్యర్థులకు అవకాశం కల్పించింది. జనవరి 6 నుంచి 11 వరకు జేఈఈ మెయిన్స్ పరీక్ష జరగనుండగా, అదే నెల 31న ఫలితాలు వెలువడతాయి.
*వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ఏటా నిర్వహిస్తున్న వేదసభను ఈ ఏడాది అక్టోబరు 2న గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని మూల్పూరు సుబ్రహ్మణ్యశాస్త్రి కల్యాణ మండపంలో నిర్వహించనున్నారు. ఈ సభకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని పండితులు హాజరై వేదసారంపై ప్రసంగిస్తారని సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు అమ్ముణ్ణి సుబ్రహ్మణ్యం, తాడేపల్లి సూర్యనారాయణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా విశ్రాంత సంస్కృత అధ్యాపకులు సామవేదం సత్యనారాయణమూర్తిని సన్మానించనున్నట్టు పేర్కొన్నారు.
*ఆంధ్రప్రదేశ్ పరిపాలనా ట్రైబ్యునల్ (ఏపీఏటీ)కి కేంద్ర ప్రభుత్వం ఇద్దరు సభ్యులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందుకు సుముఖత తెలపడం లేదని, ఆ మేరకు రాష్ట్రం సమ్మతి తెలిపేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాదులు ఏ.సూర్యారావు, ఎస్.కృష్ణమూర్తి దాఖలు చేసిన ఈ పిటిషన్పై సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్కుమార్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం ముందు విచారణ జరిగింది. ఈ వ్యవహరంలో తగిన వివరాలు తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను 14వ తేదీకి వాయిదా వేసింది.
*గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షా ఫలితాల వెల్లడికి బ్రేక్ పడింది. ఈ ఫలితాలను వెల్లడించరాదని హైకోర్టు ఏపీపీఎస్సీని ఆదేశించింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
*ప్రతి బ్యాంక్ ఖాతాదారునికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు వివిధ రుణ పథకాలను అందించాలని ప్రభుత్వరంగ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దేశవ్యాప్తంగా రెండు దశల్లో 400 జిల్లాల్లో ఈ పథకాలు అమలు చేయనున్నారు. తొలిదశలో ఏపీలోని 10 జిల్లాలను ఎంపిక చేశారు. ఈ జిల్లాల్లో ప్రధాన నగరాల్లో అక్టోబరు 3నుంచి 7వరకూ రుణ మేళాలు నిర్వహించనున్నారు.
*ప్రతి బ్యాంక్ ఖాతాదారునికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు వివిధ రుణ పథకాలను అందించాలని ప్రభుత్వరంగ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దేశవ్యాప్తంగా రెండు దశల్లో 400 జిల్లాల్లో ఈ పథకాలు అమలు చేయనున్నారు.
*ప్రాథమిక విద్య నాణ్యతాప్రమాణాల్లో తెలంగాణ రాష్ట్రం వెనకంజలో ఉంది. వివిధ ప్రామాణికాల ఆధారంగా రాష్ట్రాలకు నీతీ ఆయోగ్ ప్రకటించిన ర్యాంకుల్లో తెలంగాణ 18వ స్థానంలో నిలిచింది. నీతీ ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్కుమార్, సీఈవో అమితాబ్ కాంత్, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి రీనారే సోమవారం ఈ సూచిని విడుదల చేశారు.
*విజయవాడ ఈఎస్ఐ డైరెక్టరేట్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విస్తృత సోదాలు జరుపుతున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా ఈఎస్ఐలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇప్పటికే కొన్ని విలువైన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అవకతవకలపై ఈఎస్ఐ డైరెక్టరేట్లో ఈఎస్ఐ అధికారులను విజిలెన్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
*ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్టోబర్ 2న తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. కరపలో గ్రామ సచివాలయాన్ని సీఎం ప్రారంభిస్తారు. బుధవారం మధ్యాహ్నం 1 గంటలకు సీఎం తాడేపల్లి నుంచి బయలుదేరి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో కరప గ్రామానికి చేరుకుని పైలాన్ ఆవిష్కరించనున్నారు.
* భారీ వర్షాలతో బిహార్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. తాజా వరద పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్తో చర్చించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అన్ని రకాల సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు ప్రధాని. కేంద్ర విపత్తు స్పందన దళాలు రాష్ట్రాల విభాగాలతో కలిసి పనిచేస్తున్నట్లు ట్వీట్ చేశారు.
* నవయుగ ఇంజినీరింగ్ సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేస్తూ… జెన్‌కో ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ, ఆగస్టు 22న హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ జెన్ కో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీతారామమూర్తి సోమవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపారు.
* విద్యుత్ ప్రాజెక్టు ఒప్పందంపై గతంలో సంతకం చేసిన జెన్‌కో చీఫ్ ఇంజినీర్ ప్రభాకర్ రావు…. ఇప్పుడు ఈ ఒప్పందం అక్రమం, చట్టవిరుద్ధమని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందని…. ఆ సంస్థ న్యాయవాది వాదించారు. ఆ అధికారిపై విచారణ చేపట్టాలని కోరారు.
* ఒప్పంద నిబంధనల ప్రకారం రద్దు అంశంపై…. నవయుగ సంస్థ మధ్యవర్తిత్వ విధానాన్ని అనుసరించాలని…. జెన్‌కో ఏజీ శ్రీరాం వాదించారు. హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసేందుకు వీల్లేదని… కోర్టు న్యాయసమీక్ష చేయకూడదని అన్నారు. ప్రాజెక్ట్ నిర్వహణకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చామన్న ఆయన…. ఎన్నోసార్లు గుర్తుచేసినా పనుల్లో పురోగతి లేనందునే ఒప్పందం రద్దు చేసినట్లు చెప్పారు. గడువు పొడిగించాలన్న అభ్యర్థన తిరస్కరించామని.. నవయుగ ఒప్పంద నిబంధన ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపించారు. రీటెండరింగ్‌లో కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని…. మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరారు.
* మధ్యప్రదేశ్‌లో గుట్టురట్టయిన బృహత్‌ హనీ ట్రాప్‌ కేసుకు బెంగళూరుతోనూ లింకులు ఉన్నట్లు బయటపడింది. భోపాల్‌లో ఒక మహిళ యువతులను ఉన్నతాధికారులు, నాయకులు తదితరవీఐపీల వద్దకు పంపి వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చెయ్యడం, భారీఎత్తున నగదు, స్థిరాస్తులను సంపాదించిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుండడం తెలిసిందే.
* శ్వేత ఈ కంపెనీ తరఫున పలు కేంద్ర సంస్థల్లో పనిచేసినట్లు తెలిసింది. బ్లాక్‌ మెయిలింగ్‌ చేస్తూ అధికారులు, రాజకీయనేతలు, పారిశ్రామికవేత్తలను ట్రాప్‌లోకి దింపడం మాత్రమే కాకుండా వారిపై నిఘా పెట్టేవారు. అనుమానాస్పదం అనిపిస్తే హెచ్చరికలు జారీచేసేవారు. ఫోన్ల పర్యవేక్షణకు పలు ఆధునిక సాఫ్ట్‌వేర్లను, ఉపకరణాలను శ్వేతా వినియోగించుకునేది. తన ఐఫోన్‌ నుంచి కూడా నిఘా వేసినట్లు తెలిసింది. రాజకీయనేతలు, అధికారుల ఫోన్లలోని గ్యాలరీలోకి సైతం చొరబడే టెక్నాలజీ ఉందని సమాచారం. రహస్యంగా ఫోన్లు, వాట్సాప్‌ చాటింగ్, ఎస్‌ఎంఎస్, ఇతర విషయాలను రికార్డు చేసేవారు.
*బొగ్గు కొరతతో ఎన్టీపీసీలో విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మొదటి యూనిట్‌లో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఇప్పటికే రెండ్రోజులుగా 3, 4 యూనిట్లలో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ప్రస్తుతం 2వ యూనిట్‌లో మాత్రమే విద్యుదుత్పత్తి జరుగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 1500 మెగావాట్ల విద్యుదుత్పత్తిని నిలిచి పోయింది…
*తుని పట్టణంలో స్థానిక ఆంధ్ర రత్న రోడ్డులో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాన్ని ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ ద్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో మహిళల ధర్నా .
*మంగళగిరి రోడ్డులోని ఏఎస్ కన్వెన్షన్ సెంటర్ నందు రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారి అధ్యక్షతన ప్రారంభమైన రాష్ట్ర పదాధికారుల సమావేశం పాల్గొన్న రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ దియోదర్ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎమ్మెల్సి మాధవ్ మాజీ మంత్రి మాణిక్యాలరావు పార్థసారధి ,తురగా నాగభూషణం తదితరులు.