కనకదుర్గమ్మ దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
ఉత్సవాల్లో నాలుగో రోజు అమ్మవారు శ్రీఅన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.
శరన్నవరాత్రి మహోత్సవాలలో శ్రీఅమ్మవారిని శ్రీఅన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు.
అన్నపూర్ణాదేవి సకలజీవరాశులకు ఆహారాన్ని అందించే దేవత.
అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం సర్వజీవనాధారం. అలాంటి అన్నాన్ని ప్రసాదించేది అన్నపూర్ణాదేవి. నిత్యాన్నదానేశ్వరిగా, ప్రాణేశ్వరిగా, అన్నపూర్ణాదేవి తన బిడ్డలమైన మనకేకాక సకల చరాచర జీవరాశులకీ ఆహారాన్నందించే తల్లి. లోకంలో ఆకలిని తీర్చటంకన్నా మిన్న ఏదీలేదు. అందుకే అన్ని దానాలకన్నా అన్నదానం గొప్పదంటారు.
ఒక్కసారి ఆ నిత్యాన్నద్యానేశ్వరి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించి తరించవలసిందే.
ఇంద్రకీలాద్రీపై వేంచేసిన కనకదుర్గమ్మను అన్నపూర్ణాదేవి రూపాంలో దర్శించుకుంటే అన్ని దరిద్రాలు తోలగి పోతాయని దుర్గగుడి పండితులు చెబుతున్నారు.
ఇంద్రకీలాద్రిపై అమ్మవారి సన్నిదానంలో నిత్యాన్నదాన పధకం రోజురోజుకు వృద్ది చెందుతుంది భక్తులకు అన్న ప్రసాదం రూపంలో భక్తులకు అందిస్తున్నారు.