* కర్నూలులో ఆరుగురు ఎస్సైలు విఆర్ కు బదిలీ. ఈరోజు వేకువజామున కోవెలకుంట్లలో చిరంజీవి నటించిన సైరా సినీమాకు వెళ్లిన ఆరుగురు ఎస్సైలు విధుల్లో ఉండి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సినిమాకు వెళ్లడటంపై ఎస్పీ ఆగ్రహం.వెంటనే ఆరుగురు ఎస్సైలను వీఆర్‌కు బదిలీ చేస్తున్నట్లు తెలిపిన ఎస్పీ ఫకీరప్ప
* అమరావతి, మహాత్మా గాంధీ 150 జయంత్యుత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ కారాగారాల్లో శిక్ష అనుభవిస్తున్న 10 మంది ఖైధీలకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి నలుగురికి, విశాఖ కేంద్ర కారాగారం నుంచి ఇద్దరికి, విజయవాడ, అనంతపురం జిల్లా కారాగారాలు, కడప, నెల్లూరు, కేంద్ర కారాగారాల నుంచి ఒక్కొక్కరికి క్షమాభిక్ష ప్రసాదించింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి కేఆర్ఎం కిశోర్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు
* తాడేపల్లి గూడెం క్రికెట్ బెట్టింగ్ సొమ్ముల కోసం విద్యార్థులు గొడవ పడిన సంఘటన మండలంలోని పెదతాడేపల్లిలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో జరిగింది. మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సివిల్ ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెంకు చెందిన విద్యార్థులు, తేతలి సమీపంలోని వడ్లూరుకు చెందిన మరో విద్యార్థి మధ్య క్రికెట్ బెట్టింగ్ జరిగింది. వడ్లూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి క్రికెట్ బెట్టింగ్ సొమ్ము విషయంలో వన్ టైమ్ సెటిల్‌మెంట్ చేసుకున్నాడు. అయితే తమకు ఇంకా సొమ్ములు రావాలంటూ ఆ విద్యార్థిపై సహచర విద్యార్థులు కొట్లాటకు దిగారు. ఆ విద్యార్థిని కొడుతున్న దృశ్యాలను మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ వీడియోలు మంగళవారం వాట్సప్‌లో హల్ చల్ చేయడంతో విషయం బయటకు పొక్కింది.
* భక్తులపైకి వాహనం దూసుకెళ్లడంతో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలైన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. భవాని మాలధారణలో విజయవాడ దుర్గమ్మ గుడికి కాలినడకన బయలుదేరి వెళ్తున్న నలుగురు సభ్యుల బృందంపైకి టాటా ఎస్ వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మురాల శెట్టి సారాజు (30) అనే వ్యక్తి మృతి చెందగా.. గరగ సత్తిబాబు (30) అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరు తృటిలో తప్పించుకున్నారు. పెద్దాపురం ఏడీబీ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితులు యూ.కొత్తపల్లి మండలం మూలపేటకు చెందిన వారిగా గుర్తించారు.
* విద్యార్ధిని ఆత్మహత్య, గంపలగూడెం మండలం వినగడపకు చెందిన స్వప్న సెకండ్ ఇంటర్ ఎంపీసీ చదువుతూ తిరువూరు లోని కళాశాల హాస్టల్లో ఉంటున్నది.తిరువూరు లోని ఒక ప్రైవేటు కళాశాల హాస్టల్ విద్యార్ధిని ఉరి వేసుకుని ఆత్మహత్య.
* ఓ ప్రేమికుడు తన ప్రేయసిని దారుణంగా చంపేశాడు. ఆపై భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని మలాడ్ లో జరిగింది. మంగేష్ రాణే (24) అనే యువకుడు ఓ అమ్మాయిని రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. సోమవారం మంగేష్ తన ప్రేయసి ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో సహనం కోల్పోయిన మంగేష్ తన ప్రియురాలిపై కత్తితో దాడి చేశాడు. అనంతరం భవనం పదో అంతస్తు పైనుంచి దూకాడు. ఈ ఘటనలో మంగేష్ అక్కడికక్కడే చనిపోయాడు. ఆయన ప్రియురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. పోస్టుమార్టం కోసం మంగేష్, అతడి ప్రియురాలి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
* బైక్ లను దొంగిలించే దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన ప్రకాశం జిల్లాలో అద్దంకిలో బుధవారం రోజు చోటు చేసుకుంది. దర్శి డీఎస్పీ ప్రకాశరావు విలేకరులతో మాట్లాడుతూ.. ముండ్లమూరు మండలానికి చెందిన చల్లా శివప్రసాద్ ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఎనిమిది బైక్‌లను దొంగిలించాడని, అతనిపై పలు కేసులు నమోదయ్యాయని తెలిపారు. అద్దంకి పోలీసులు చాకచక్యంగా బైక్‌ల దొంగను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. దొంగిలించిన బైక్ ల విలువ అయిదున్నర లక్షల రూపాయలు ఉంటాయని డీఎస్పీ వెల్లడించారు. ముద్దాయిని పట్టుకోవడంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారని వారిని డిఎస్పీ అభినందించారు.
* జలుమూరు మండలంలోని మర్రివలస పంచాయతీ ఎస్టి మాకివలస వద్ద బుధవారం నాలుగు ఏనుగులు సంచారం చేశాయి. ఇవి ఎల్‌ఎన్ పేట మండలం సిద్ధాంతం వైపు నుండి వంశధార నది దాటి ఇక్కడకు వచ్చినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఎస్టి మాకివలస వద్దనున్న కొండల్లో ఈ ఏనుగులు ఉండటంతో. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.