‘అందరూ ఇప్పటివరకు నా ప్రేమను చూశారు. ఇక నుంచి నా కోపాన్ని, ద్వేషాన్ని చూపిస్తా’ అని అంటున్నారు బాలీవుడ్ ముద్దుగుమ్మ ఐశ్వర్య రాయ్ బచ్చన్. హాలీవుడ్ అందాల తార ఏంజెలీనా జోలీ నటిస్తున్న తాజా చిత్రం ‘మాలిఫిసెంట్ : మిస్ట్రన్ ఆఫ్ ఈవిల్’. ఈ చిత్రంలో ఏంజెలినా.. మాలిఫిసెంట్ అనే దుష్టజీవి పాత్రలో నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమా హిందీలోనూ విడుదల కానుంది. ఏంజెలీనా పాత్రకు బాలీవుడ్ అందాల నాయిక ఐశ్వర్యరాయ్ గాత్రం ఇవ్వనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన హిందీ ట్రైలర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఐశ్వర్యరాయ్ డబ్బింగ్‌తో ఉన్న ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ ప్రారంభంలో ఐశ్వర్య కనిపించి ఇక నుంచి తనలోని కోపాన్ని, ద్వేషాన్ని చూపిస్తానంటూ చెబుతారు. ఈ ట్రైలర్‌లో ఐశ్వర్య నల్ల డ్రెస్సులో అందంగా కనిపించారు. వాల్ట్ డిస్నీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జోచిమ్ రోనింగ్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
దెయ్యానికి గాత్రం
Related tags :