అమెరికా తెలుగు సంఘం(ఆటా) 2020 మహాసభలు లాస్ఏంజిల్స్‌లోని అనెహైం కన్వెన్షన్ సెంటరులో 2020 జులై 3,4,5 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు భీంరెడ్డి పరమేశ్ తెలిపారు. శనివారం నాడు లాస్ఏంజిల్స్‌లో ఆటా కార్యవర్గ సమావేశంలో ఈ తీర్మానానికి ఆమోదముద్ర వేశారు. ఈ సమావేశంలో ఆటా సభల నిర్వహణ వ్యయాల కింద మిలియన్ డాలర్లు విరాళాలుగా అందినట్లు పరమేశ్ వెల్లడించారు. 2006లో ఇదే నగరంలో సభలు జరిగాయని, మరోసారి 16వ ఆటా సభల రూపంలో ఇక్కడ తిరిగి ఆటా సభలు జరుపుకోవడం ఆనందంగా ఉందని పరమేశ్ పేర్కొన్నారు. దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం(TASC), లాస్ఏంజిల్స్ తెలుగు సంఘం(LATA), ట్రైవ్యాలీ తెలుగు సంఘం(TATVA)లు ఈ సభలకు సహకారం అందిస్తాయి. కార్యవర్గ సమావేశంలో 2019 డిసెంబరులో తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే ఆటా వేడుకలపై ప్రణాళికా చర్చ జరిపారు. ఏపీ, తెలంగాణాల్లో నిర్వహించే ఈ ఆటా వేడుకలకు ఆటా కార్యనిర్వాహక అధ్యక్షుడు బుజాల భువనేశ్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని పరమేశ్ పేర్కొన్నారు.
ఆటా 16వ మహాసభల సమన్వయకర్తగా ద్యాసాని నరసింహ, సహ సమన్వయకర్తగా విజయ్ తూపల్లి, కోఆర్డినేటర్‌గా రిందా సామ, లోకల్ కోఆర్డినేటర్‌గా బయపా రెడ్డి, కాన్ఫరెన్స్ డైరెక్టర్‌గా వెంకటరమణ మురారీ, కాన్ఫరెన్స్ కో-డైరెక్టర్‌గా కాశప్ప మాధరం, కాన్ఫరెన్స్ కో-డైరెక్టర్‌గా రవీందర్ రెడ్డి కొమ్మెర, మల్లిక్ బండాను కో-చైర్‌గా నియమించారు. కార్యవర్గ సమావేశం అనంతరం అనాహైమ్ కన్వెన్షన్ సెంటర్(ACC)లో పర్యటించారు. ఇది లాస్ ఏంజిల్స్ (LAX) అంతర్జాతీయ విమానాశ్రయానికి 13మైళ్ల దూరంలో, ప్రఖ్యాత డిస్నీల్యాండ్ రిసార్ట్ సమీపంలో ఉంది. వేడుకలకు హాజరయ్యే అతిథుల చిన్నారులు డిస్నీల్యాండ్ సందర్శించేందుకు ఆటా డిస్కౌంట్ ధరలకు టికెట్లను అందుబాటులోకి తీసుకురానుంది. 14ఏళ్ల తర్వాత లాస్ఏంజిల్స్‌కు తరలివస్తున్న ఆటా సభలను విజయవంతం చేయాలని పరమేశ్ కోరారు. టిడిఎఫ్, నాటా, నాట్స్, టాటా, తానాతో సహా వివిధ సంస్థల నుండి వచ్చిన ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.
ఆటా మహాసభల అమలును పర్యవేక్షించడానికి బోర్డు కమిటీని నియమించింది. ఈ కమిటీలో పర్మేష్ భీంరెడ్డి-అధ్యక్షుడు, భువనేష్ బూజాలా ప్రెసిడెంట్-ఎలెక్ట్, కరుణకర్ అసిరెడ్డి గత అధ్యక్షుడు, నర్సింహ ధ్యసాని-కన్వీనర్, రిందా సమా-కోఆర్డినేటర్, వేణు సంకినేని-కార్యదర్శి, రవి పట్లోలా-కోశాధికారి, రఘువీర్ రెడ్డి, కృష్ణ ద్యాప, సతీష్ రెడ్డి, అనిల్ రెడ్డి, మరియు రామ్ అన్నాడి సభ్యులుగా ఉంటారు. అమర్ రెడ్డి మూలమల్లాను అంతర్జాతీయ సమన్వయకర్తగా, మల్లిక్ బొంతు TASC కో-ఆర్డినేటర్‌గా నియమించారు.
ఆటా కార్యవర్గం లాస్ ఏంజిల్స్ బృందానికి ఈ సమావేశంలో పాల్గొన్న వారందరికీ గొప్ప ఆతిథ్యం అందించినందుకు మరియు సమావేశాన్ని విజయం చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. లాస్ ఏంజిల్స్ బృందంలో నర్సింహ ధ్యాసాని-కన్వీనర్, రిందా సామ – సమన్వయకర్త, రవీందర్ రెడ్డి కాన్ఫరెన్స్ అడ్వైజరీ చైర్, ప్రాంతీయ సమన్వయకర్త అభినవ్ చిర్రా, రవీందర్ ద్యాప, స్టాండింగ్ కమిటీ చైర్, శ్రీనాథ్ పేరం స్టాండింగ్ కమిటీ కో-చైర్, కుమార్ తాళంకి గత ప్రాంతీయ డైరెక్టర్, ప్రవీణ్ నయని గత ప్రాంతీయ సమన్వయకర్త మరియు వాలంటీర్లు సునీల్ తోకల, నిరంజన్ చలాసాని, నాగరాజ్ గౌడ్, సాగర్ గాదె, అంజన్ కుమార్ ఈ సమావేశంలో పాల్గొన్న వారందరికీ గొప్ప ఆతిథ్యం అందించినందుకు మరియు సమావేశాన్ని విజయం చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.