గాంధీ జయంతి రోజునే మద్యం దుకాణాలు నిర్వహిస్తుండటం ద్వారా సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఎవరి విశ్లేషణలకూ అందని విధంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రం జగన్ జాగీరు కాదన్నారు. చట్టాలను తన చుట్టంగా మార్చుకొని ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డిని ఎవరు చంపారో ఇప్పటివరకు తేల్చలేకపోయారన్నారు. అందరూ అవినీతిపరులు.. తానొక్కడినే నీతిమంతుడు.. అన్న చందంగా సీఎం జగన్ వ్యవహార శైలి ఉందన్నారు. 2003లోనే తెదేపా హయాంలో గ్రామ సచివాలయాలను ప్రారంభించామని.. ఇప్పడు సీఎం జగన్ కొత్తగా చేస్తున్నదేమీ లేదన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా మహాత్ముడి స్ఫూర్తితో ముందుకు సాగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
జయంతి. జగన్. జాగీరు.
Related tags :