DailyDose

చంద్రబాబు లోకేశ్‌లు కమెడీయన్లు-తాజావార్తలు-10/02

Chandrababu & Lokesh Are No Short Of Comedians Says Vijayasai Reddy

* చంద్రబాబు, లోకేష్ లు ఈ దశాబ్దపు కామీడియన్ లని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డీ విరుచుకుపడ్డారు
* సైరా సినిమాను డ్యూటీలో ఉంది అనుమతి లేకుండా చూసినందుకు కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో ఆరుగు ఎసైలను ఒకేసారి ఎస్పీ బదిలీ వేటు వేయటం సంచలనం కలిగించింది
* గ్ర్రామస్థాయిలో సచివాలయాలను ప్రారంభించడం దేశ చరిత్రలోనే రికార్డ్ అని సీఎం జగన్ ప్రకటించారు
* మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు
* ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజున దుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు
* ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న విద్యుత్ ఉద్యోగుల విభజన విషయంలో ఉభయ రాష్ట్రాల అధికారుల మధ్య ఓ ఒప్పందం కుదిరింది
* గూడూరు విజయవాడ మధ్య నడిచే ఇంటర్ సిటీ ఎక్సప్రస్ కు విక్రమ సింహపురి-అమరావతి సూపర్ ఫాస్ట్ ఎక్సప్రస్ గా నామకరణం చేసారు
* మద్యపాన నిషేదాన్ని దశల వారీగా ప్రవేశ పెడతామని ప్రకటించిన జగన్ ప్రభుత్వం, జనావాసాల మధ్యనే మద్యం దుకాణాలను ప్రారంబిస్తూ ఉండడంతో చాలా చోట్ల మహిళలు ఆందోళనకు దిగుతున్నారు
* గ్రామ సచివాలయాల వ్యవస్థ తొందరపాటుతో కూడిన నిర్ణయం అని అవగాహన లేకుండా జగన్ తీసుకున్న దూకుడు నిర్ణయం అని మాజీ ముఖ్యమంత్రి నాదెళ్ళ భాస్కర్ రావు ఆరోపించారు
* ఏపీపీఎస్సీ కార్యదర్శి మౌర్యాను ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది
* ఏపీలో నూతన గ్రామ సచివాలయ వ్యవస్థ నేటి నుండి అమల్లోకి వచ్చింది
* బీసీసీఐ సలహా మండలి ప్రముఖ కికెటర్ కపిల్ దేవ్ రాజీనామా చేసారు
* పాకిస్థాన్ లో బాలల హక్కులను హరిస్తున్నారని 144 మంది చిన్నారులను పోలీసులు నిర్భందించారని సుప్ర్రేం కోర్టు నియమించిన జువైనల్ జస్టిస్ కమిటీ నివేదిక ఇచ్చింది
* అరసవెల్లిలో సూర్యభగవానుడి పాదాలను భానుడి కిరణాలు తాకాయి. సంవత్సరానికి ఒకసారి మాత్రమె ఈ అరుదైన సంఘటన భక్తులకి దర్శనమిస్తుంది