ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ మరోసారి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. గతంలో కేంబ్రిడ్జి ఎనలిటికాలో జరిగిన కుంభకోణం తర్వాత ఫేస్ బుక్ డేటా చౌర్యం వెలుగులోకి వచ్చింది. నాటి నుంచి ఫేస్ బుక్ తన ఉనికిని కాపాడుకునేందుకు తంటాలు పడుతోంది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తన ఉద్యోగులతో మాట్లాడిన అంతర్గత ఆడియో బహిర్గతం కావడం దుమారం రేపుతోంది. డెమొక్రాటిక్ అభ్యర్ధి ఎలిజబెత్ వారెన్ అధ్యక్షురాలిగా ఎన్నికైతే సంస్థకు జరిగే నష్టం , చైనాకు చెందిన వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ తో పోటీ, ఎలిజబెత్ వారెన్ అమెరికా అధ్యక్షురాలిగా ఎన్నికైతే వచ్చే సమస్యలు, ఫేస్ బుక్ తో పాటు గూగుల్, అమెజాన్ సంస్థల్ని వారెన్ ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారనే తదితదర అంశాలపై మార్క్ జూకర్ బర్గ్ ప్రస్తావించినట్లు దివెర్జ్ పొందుపరిచింది. అయితే జూకర్ వ్యాఖ్యలపై ఎలిజబెత్ వారెన్ వరుస ట్వీట్లతో మండిపడ్డారు. చట్ట విరుద్ధంగా అవినీతికి పాల్పడుతున్న ఫేస్ బుక్ ను అడ్డుకుంటే నిజంగా సక్ అవుతుందని ట్వీట్ చేశారు. అంతేకాదు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లను సొంతం చేసుకొని మార్కెట్ లో ఆధిపత్యం చెలాయిస్తోందని ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా వెర్జ్ కథనాన్ని జూకర్ బెర్గ్ ఖండించారు. సంభాషణ అంతర్గతమే అయినా ఆసక్తి వున్నవాళ్లు ఫిల్టర్ చేయని వెర్షన్‌ను చెక్ చేసుకోవచ్చని ఒక లింక్‌ను షేర్ చేశారు.
జుకర్‌బర్గ్ నోటి దురుసు
Related tags :