Movies

మేఘా మాంచి అనుభవశీలి

Megha Choudary On Her Entry Into Movies

పక్కింటి అమ్మాయిలాగా కనిపించే పద్ధతైన పాత్ర నాది అంటోంది మేఘా చౌదరి. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’. నవీన్‌ విజయకృష్ణ, అవసరాల శ్రీనివాస్‌ కథానాయకులుగా నటించారు. బాలాజీ సానల దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది మేఘా చౌదరి.
* ‘‘తెలుగులో ‘మార్షల్‌’ తర్వాత నేను చేసిన చిత్రమిది. గౌరీ అనే పాత్రలో నటించా. నేటితరం అమ్మాయిలకు ప్రతినిధిగా కనిపిస్తా. కథానాయకుడికి సమానమైన పాత్రను పోషించా. సినిమాలో అనురాగ్‌ కులకర్ణి – రాశీ ఖన్నాలు పాడిన ‘కన్నా..’ పాటంటే నాకు చాలా ఇష్టం. కోట శ్రీనివాసరావు, జయసుధ, రావు రమేష్‌, అవసరాల శ్రీనివాస్‌ లాంటి అనుభవమున్న నటులతో పనిచేసే అవకాశం వచ్చింది’’.
* ‘‘మాది కోల్‌కతా. 16 ఏళ్ల వయసులోనే చిత్ర పరిశ్రమలోకి వచ్చా. శ్రద్ధా కపూర్‌ నటించిన ‘హసీనా పార్కర్‌’ చిత్రానికి దర్శకుడు అపూర్వ లకియా వద్ద సహాయ దర్శకురాలిగా చేశా. ‘ఎం.ఎస్‌.ధోని’ చిత్రానికి కాస్టింగ్‌ అసిస్టెంట్‌గా పనిచేశా. బెంగాలీ సినిమా ‘అమర్‌ ప్రేమ్‌’తో కథానాయికగా వెండితెరపై అడుగుపెట్టా. ప్రస్తుతం తెలుగు చిత్రాలపైనే దృష్టిపెట్టా’’.