DailyDose

భాజపాలోకి పదిమంది నేతల జంప్-రాజకీయ-03/10

10 Politicians Jumping To BJP-Telugu Political News Today-10/03

* బీజేపీలోకి కొనసాగుతున్న వలసల పర్వం 01. శనక్కాయల అరుణ (మాజీ మంత్రి, టీడీపీ) 02. వాకాటి నారాయణరెడ్డి (, ఎమ్మెల్సీ – టీడీపీ) 03. చింతల పార్థసారథి (జనసేన) 04. పాతూరి నాగభూషణం (మాజీ జెడ్పీ చైర్మన్) 05. నక్కా బాలయోగి (హైకోర్టు మాజీ న్యాయమూర్తి) 06. తోట నాగేష్ (టీడీపీ) 07. రామినేని ధర్మ ప్రచారం (ఎన్ఆర్ఐ – రామినేని ఫౌండేషన్) 08. గట్టి చిన్న సత్యనారాయణ (టిడిపి నేత) 09. బొబ్బిలి శ్రీనివాస రావు (కాంగ్రెస్ నేత) 10. రవి (పూతల పట్టు) బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ను కలిసిన నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా నేతృత్వంలో ఢిల్లీ చేరిన బృందం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరనున్న నేతలు.
* ప్రియాంకగాంధీకి షాకిచ్చిన ఎమ్మెల్యే!
ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అదితిసింగ్‌ బుధవారం మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా నిర్వహించిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు హాజరై.. కాంగ్రెస్‌ వర్గాలను విస్మయ పరిచారు. విపక్షాలన్నీ ఉమ్మడిగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను బహిష్కరించాయి. మరోవైపు యూపీ సర్కారుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ లక్నోలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రియాంక ర్యాలీకి డుమ్మా కొట్టి మరీ అదితి సింగ్‌ అసెంబ్లీకి హాజరుకావడం గమనార్హం.అదితి సింగ్‌ రాయ్‌బరేలి జిల్లా ఎమ్మెల్యే. ఈ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉన్నది. అదితి తండ్రి అఖిలేశ్‌ సింగ్‌ గాంధీ కుటుంబానికి సన్నిహితుడు. అదితి కూడా ప్రియాంక సన్నిహిత అనుచరురాలుగా ఇన్నాళ్లు కొనసాగారు. కానీ, బుధవారం అనూహ్యంగా ఆమె ప్రియాంక ర్యాలీకి గైర్హాజరై.. అసెంబ్లీకి హాజరు కావడం కాంగ్రెస్‌ వర్గాలకు షాక్‌ ఇచ్చింది.అదితి త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారని, ఈ క్రమంలో యోగి సర్కారు నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు ఆమె హాజరయ్యారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే, తాను బీజేపీలో చేరతున్నట్టు వస్తున్న కథనాలను అతిది సింగ్‌ కొట్టిపారేశారు.
*అక్టోబరు 10 నుండి కమ్యునిస్టుల ఆందోళన
శ్రీకాళహస్తిలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రెస్ మీట్. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా అక్టోబరు 10వ తేదీ నుంచి ఐదు
వామపక్ష పార్టీలతో కలిసి దేశవ్యాప్త ఆందోళన. కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుంది. వారు చెప్పినట్టు వినని వారి ఇళ్ళపై సిబిఐ దాడులు నిర్వహించడం పరిపాటైందన్నారు.జగన్మొహన్ రెడ్డి కక్ష సాదింపు చర్యలు తప్ప ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు.రాష్ర్టంలో మీడియాపై అంక్షలు విధించడాన్ని తప్పుబట్టిన నారాయణ.ఛానళ్ల ప్రసారాలు నిలుపుదల చేయడం కక్షసాధింపు చర్య. మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం అప్రజాస్వామికం. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
* చంద్రబు వల్లే ఆర్ధిక పరిస్థితులు దిగజారింది: మంత్రి బొత్స సత్యనారాయణ
గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వలనే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కుంటుపడిందిఎన్ని ఇబ్బందులు ఎదురైన ఒకటో తారీకున ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నాంగత ప్రభుత్వం మునిసిపల్ శాఖలోనే 15 వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది అన్న క్యాంటీన్ నిర్మాణంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగింది ప్రభుత్వ హాస్పటల్ ల వద్ద క్యాంటీన్ లు ఏర్పాటు చేస్తాం రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉన్న విషయం వాస్తవమే
గ్గు కొరత వలనే విద్యుత్ కోతలు ప్రభుత్వం పై కన్నా లక్ష్మీ నారాయణ విమర్శలు సరికాదుకన్నా ఏ దృష్టితో చూసి విమర్శలు చేస్తున్నారో ఆయనే సమాధానం చెప్పాలిరాష్ట్రంలో నూతన ఇసుక పాలసీ తో సమస్యలు త్వరలోనే పరిష్కరించబడతాయిగత ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకు వందల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసింది110 మునిసిపాల్టీలలో రాబోయే కాలంలో ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నాం
*హుజూర్ నగర్ లో సీపీఎం నామినేషన్ తిరస్కరణ
తెలంగాణలో అత్యంత ప్రతిస్తాత్మకంగా మారిన హుజూర్ నగర్ఉప ఎన్నికల ట్విస్ట్లో మీద ట్విస్ట్ లు ఓ వైపు భారీ ఎత్తున సర్పంచ లు నామినేషన్ వేసి సర్కారుకు వ్యతిరేకంగా తమ సత్తా చాటాలని చూడగా సీపీఎం ఒంటరిగా బరిలో ఉంటామని ప్రకటించింది. చివరకు సీపీఎం అభ్యర్ధి నామినేషన్ కూడా తిరస్కరణకు గురి కావటంతో షాక్ కు గురవటం ఆపార్టీ వంతు అయ్యింది. సత్తా చాటడం సంగతి అలా ఉంచి సరిగ్గా నామినేషన్ కూడా వేయలేకపోయారనే విమర్శలు మూతకట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు తిరస్కరణకు గురైన వాటిలో సీపీఎం అభ్యర్ధి పాలేపల్లి సేఖర్రావు నామినేషన్ తో పాటు తెలంగాణ ఇంటిపార్టి అభ్యర్ధి సాంబశివాగౌడ్, స్వతంత్ర అభ్యర్ధి లక్ష్మి నరసమ్మ వికలాంగుడు గిద్ద రాజేష్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన లింగిది వెంకటేశ్వర్లుకు చెందిన నామినేషన్ పత్రాలు ఉన్నాయి. ఉప ఎన్నికకు సోమవారంతోనే నామినేషన్ల గడువు ముగిసిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం నాడు నామినేషన్‌ పత్రాలను అధికారులు పరిశీలించారు. వీటిలో సరైన దృవ పత్రాలు పొందుపరచని కారణంగా కొన్నింటిని తిరస్కరించారు. నామినేషన్ల తిరస్కరణపై కొంత మంది అభ్యర్థులు ఆందోళనకు దిగారు. పోటీకి తమను అనుమతించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు ఈ ఉప ఎన్నికకు మొత్తం 119 నామినేషన్లు దాఖలైన విషయం తెలిసిందే. చివరకు బరిలో ఎంత మంది నిలుస్తారో వేచిచూడాల్సిందే.
*కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో హాంకాంగ్ తరహా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కెసీఆర్ నిరంకుశ, నియంత తరహా పాలన అడ్డుకునేందుకు ఇదే మార్గమన్నారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఆర్ధిక మాంద్యం ఉందన్న కేసీఆర్‌ కొత్త సచివాలయం ఎందుకు కడుతున్నాడని ప్రశ్నించారు. సచివాలయంపై హైకోర్టు తీర్పిచ్చినా ముందుకెళ్లుండడంపై పార్టీలకతీతంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని దోచుకున్న బందిపోటు దొంగలు హుజూర్‌నగర్‌పై పడ్డారని కోమటిరెడ్డి విమర్శించారు.
*టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు కామెంట్స్
సీఎం జగన్ పవర్ సెక్టార్ పై వైట్ పేపర్ రిలేజ్ చేయాలి.ఏపిలో అప్పుడే విద్యుత్ కోతలు ప్రారంభం అయ్యాయి.ప్రాజెక్టులు అన్ని నీటితో నిండి ఉన్న విద్యుత్ కోతలా ?ఇప్పటికే పరిశ్రమలు వెనక్కు పోతున్నాయి. ఇక విద్యుత్ కోతలు ఉంటే పూర్తిగా వెళ్లి పోతారు.విద్యుత్ కోతల ప్రభావం రాష్ట్ర ఆర్దిక రంగం పై కూడా పడుతుంది.కేసిఆర్ ను అడగకుండా జగన్ ఏ పని చేయలేని పరిస్థితి లో ఉన్నారు.కేసిఆర్ ను అడిగి కొత్తగూడెం నుంచి బొగ్గు ఎందుకు తెచ్చుకో లేకపోతున్నారు.
*మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కామెంట్స్
మద్యం పాలసీ విషయం లో జగన్ మాట తప్పారు….మడమ తిప్పారు….ప్రభుత్వ ఉద్యోగులతో మద్యం అమ్మించడం సిగ్గుచేటు,డిస్టిలరీ ల నుంచి 2 వేల కోట్లు జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.ఇష్టాను సారంగా మద్యం ధరలు పెంచారు.మద్యం రూపంలో సామాన్య ప్రజలను దోచుకుంటున్నారు. అద్దెల రూపంలో పెద్ద ఎత్తున దోపిడి జరుగుతుంది.గుడి , బడి అనే తేడా లేకుండా ఇష్టానుసారంగా షాపులు ఏర్పాటు చేస్తున్నారు.వ్యతిరేకిస్తున్న మహిళలపై పోలీసులతో దాడులకు పాల్పడుతున్నారుఏపిని మద్యాయాంధ్రప్రదేశ్ గా మార్చారు.
* టీడీపీకి ‘తోట’ రాజీనామా ?
విశాఖ జిల్లాలో సీనియర్‌ నాయకుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ తోట నగేష్‌, టీడీపీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోను, పాయకరావుపేటలోనూ టీడీపీ పరాజయం పాలవడంతోపాటు నియోజకవర్గంలో వర్గాలుగా విడిపోయిన టీడీపీ నాయకులు ఒకటిగా కలిసే అవకాశం కనబడకపోవడంతో అప్పటి నుంచి తోట నగేష్‌ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.ఈనేపధ్యంలో పార్టీ మారాలని నిర్ణయించుకున్న ఆయన నియోజకవర్గంలో పట్టున్న పలు గ్రామాల్లో పర్యటించి తన మద్దతుదార్లను కూడగట్టుకునే ప్రయత్నం చేశారు. అదే విధంగా గత కొద్ది నెలలుగా తోట నగేష్‌తో బీజేపీ, వైసీపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు కర్‌జీ విడివిడిగా పాయకరావుపేటలోని తోట నగేష్‌ ఇంటికి వచ్చిన విషయం తెలిసిందే. చివరకు తోట నగేష్‌ బీజేపీలో చేరడానికి సుముఖంగా ఉన్నారు.
*ప్రభుత్వోద్యోగులతో మద్యం అమ్మించడమేంటి?: కొల్లు
ఆంధ్రప్రదేశ్‌ను మద్యాంధ్రప్రదేష్‌గా మార్చారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. మద్యం పాలసీ విషయంలో జగన్ మాట తప్పారు.. మడమ తిప్పారు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో మద్యం అమ్మించడం సిగ్గుచేటు అన్నారు. డిస్టిలరీ‌ల నుంచి 2 వేల కోట్లు జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఇష్టానుసారంగా మద్యం ధరలు పెంచారన్నారు. మద్యం రూపంలో సామాన్య ప్రజలను దోచుకుంటున్నారన్నారు. అద్దెల రూపంలో పెద్ద ఎత్తున దోపిడి జరుగుతుందని తెలిపారు. గుడి, బడి అనే తేడా లేకుండా ఇష్టానుసారంగా షాపులు ఏర్పాటు చేస్తున్నారన్నారు. వ్యతిరేకిస్తున్న మహిళలపై పోలీసులతో దాడులకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు.
*తెదేపాపై విష ప్రచారాన్ని కట్టడి చేయాలి
తెదేపాపై సోషల్ మీడియాలో జరుగుతున్న విషప్రచారాన్ని కట్టడి చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య డిమాండ్ చేశారు. వైకాపా నిర్వహిస్తున్న సోషల్ మీడియా ప్రచారంపై గుంటూరులోని అరండల్పేట పోలీసులకు ఆయన బుధవారం ఫిర్యాదు చేశారు. ‘తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేశ్తో పాటు ఇతర నేతలు, మహిళలను ఉద్దేశిస్తూ అసభ్య చిత్రాలు, వెకిలిరాతలతో పోస్ట్లు పెడుతూ కించపరుస్తున్నారు.
*5న ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ
రైతుభరోసా కార్యక్రమ ప్రారంభానికీ ఆహ్వానంఈనాడు, అమరావతి: ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అక్టోబరు 5న కలవనున్నారు. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఖరారైనట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. శనివారం మధ్యాహ్నం దిల్లీలో వీరి భేటీ ఉంటుంది. ప్రధానంగా కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు, కాకినాడలో పెట్రోకెమికల్ కాంప్లెక్సు ఏర్పాటుకు కేంద్రం నుంచి సహకారం కోరనున్నారని తెలిసింది. దీంతోపాటు.. అక్టోబరు 15 నుంచి అమలుచేసే ‘రైతుభరోసా’ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి తలపెట్టారని, ఈ కార్యక్రమానికి హాజరుకావాలని స్వయంగా ఆహ్వానించేందుకే దిల్లీ వెళ్తున్నారని సమాచారం. విభజన సమస్యల పరిష్కారానికి సంబంధించిన అంశాలపైనా జగన్ మోదీకి వినతిపత్రాలు ఇవ్వనున్నారు.
*టీడీపీకి ‘తోట’ రాజీనామా ?
విశాఖ జిల్లాలో సీనియర్ నాయకుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్, టీడీపీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోను, పాయక రావుపేటలోనూ టీడీపీ పరాజయం పాలవడంతోపాటు నియోజకవర్గంలో వర్గాలుగా విడిపోయిన టీడీపీ నాయకులు ఒకటిగా కలిసే అవకాశం కనబడకపోవడంతో అప్పటి నుంచి తోట నగేష్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
*నన్ను బ్లాక్మెయిల్ చేయాలనుకోవద్దు
‘‘కేవలం మీవి ప్రాంతీయ పార్టీలు. మాది జాతీయ పార్టీ. ప్రపంచంలోనే శక్తిమంతమైన మోదీ నాయకత్వం కింద పని చేస్తున్నామనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. మీరా..నన్ను ఆ పార్టీకి అద్దె మైకు..ఈ పార్టీకి అద్దె మైకు అని విమర్శించేది? బ్లాక్ మెయిల్ చేసి సమస్యల నుంచి తప్పించుకోవాలని చూస్తే వదిలే ప్రసక్తేలేదు’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అధికార పార్టీ తీరుపై ధ్వజమెత్తారు. గుంటూరులో మంగళవారం ఆ పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో మాట్లాడారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. ‘మేము ప్రజల సమస్యల పరిష్కారం కోసం గవర్నర్ను కలిశాం. ముఖ్యమంత్రికి లేఖలు రాశాం. వీటిని సహించలేకే నాపై, పార్టీపై అభాండాలు వేస్తున్నారని’ దుయ్యబట్టారు. ‘గత తెదేపా ప్రభుత్వానికి, ప్రస్తుత వైకాపా ప్రభుత్వానికి ఏమీ తేడా లేదు.
*విద్యుత్తు కోతలతో చెడ్డపేరు
విద్యుత్తు, ఇసుక సరఫరాలో వస్తున్న ఇబ్బందులతో జగన్ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు. ఇటీవల విధిస్తున్న విద్యుత్తు కోతలతో ప్రజల్లో అసంతృప్తి కనిపిస్తోందన్నారు. రాజమహేంద్రవరంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వానికి మెజారిటీ ఎక్కువగా ఉందని, అంతమాత్రాన అధికారం శాశ్వతం అనుకోవద్దన్నారు. గతం నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు.
*ఏటా అక్టోబరు 1న రాష్ట్ర అవతరణ వేడుక జరపాలి: తులసిరెడ్డి
ఏటా అక్టోబరు 1న ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం గుంటూరులో ఆంధ్రా మేధావుల ఫోరం ఆధ్వర్యాన ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రప్రభుత్వం ఈ మేరకు తగిన చర్యలు చేపట్టాలని సమావేశానికి హాజరైన వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు కోరారు. ఆంధ్ర మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, కార్యదర్శి తాటికొండ నరసింహారావు, ఉపాధ్యక్షుడు మూర్తి, ప్రత్యేక హోదా సాధన సమితి జిల్లా అధ్యక్షుడు పీవీ మల్లికార్జునరావు, జనసేన నాయకురాలు రమాదేవి, నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి పాల్గొన్నారు.
*సీబీఐ వ్యాఖ్యలు సీఎంకు సిగ్గుచేటు: చంద్రబాబు
‘జగన్ జైల్లో ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేసినందున.. ముఖ్యమంత్రిగా మరింత చేయగలరని సీబీఐ చేసిన వ్యాఖ్యలపై ఆయన సమాధానం చెప్పాలి. అవినీతి నియంత్రణకు తనను దేవుడు పంపాడని ఆయన చెప్పడం సిగ్గుచేటు. సీబీఐ కేసుల్లో నిండా మునిగిన ఆయన నీతులు చెప్పడం విడ్డూరం. అవినీతి ఆస్తుల్ని ప్రభుత్వానికి అప్పగించి నిజాయతీ పాటిస్తే.. అప్పుడు జగన్ను నేనూ అభినందిస్తా’ అని ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. 13 జిల్లాలకు చెందిన మాజీ సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీరాజ్ ఛాంబర్ల రాష్ట్ర అధ్యక్షులతో మంగళవారం గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ హయాంలో గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యానికి బాటలు వేశామని, ఆయనకు అదే అసలైన నివాళి అని పేర్కొన్నారు. నాలుగు నెలల వైకాపా పాలనలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. వైకాపాలో చేరకపోతే బిల్లులు చెల్లించేది లేదని బెదిరిస్తున్నారని సమావేశంలో కొందరు వాపోయారు. వారి పోరాటంలో తెదేపా అండగా ఉంటుందని చంద్రబాబు భరోసానిచ్చారు.
*మీ చేతగానితనంతోనే కరెంటు కోతలు: కళా
ముఖ్యమంత్రి జగన్ 4నెలల్లోనే రాష్ట్రాన్ని కరెంటు కోతలతో అంధకారంలోకి నెట్టారని.. యూనిట్ రూ.4.84కు వచ్చే పవన, సౌర విద్యుత్ కొనడాన్ని నిలిపేసి యూనిట్ రూ.6కు బయటినుంచి కొంటున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావు ధ్వజమెత్తారు. రాష్ట్రానికి తెలంగాణ నుంచి రావలసిన రూ.5,700 కోట్ల విద్యుత్ బకాయిలను జగన్ ప్రభుత్వం ఈ 4నెలల్లో ఎందుకు వసూలు చేయలేదని ప్రశ్నించారు. ‘తెదేపా ప్రభుత్వ అవినీతే కరెంట్ కోతలకు కారణమని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పడం వైకాపా ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం’ అని విమర్శించారు.
*మరో ముగ్గురు అభ్యర్థులను ప్రకటించిన ఎంఐఎం
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల కోసం..ఆబిడ్స్, న్యూస్టుడే: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భాగంగా ముంబయిలోని మూడు అసెంబ్లీ స్థానాలకు మజ్లిస్ పార్టీ మంగళవారం అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఒక ప్రకటన విడుదల చేశారు. ముంబయిలోని ముంబ్రా- కల్వా నియోజకవర్గం నుంచి బర్కతుల్లా అలీహసన్ షేక్, ముంబాదేవీ నుంచి బషీర్ మూసాపటేల్, ధారావి నుంచి మనోజ్కుమార్ మార్తాండ్రావ్ సంసారే పోటీ చేయనున్నారు. ఈ ముగ్గురితోపాటు ఇప్పటి వరకు ఎంఐఎం మహారాష్ట్రలోని 28 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
*డిసెంబరులో పుర పోరుఏపీ పురపాలక మంత్రి బొత్స
ఏపీలో పురపాలక, నగరపాలక సంస్థలకు డిసెంబరులో ఎన్నికలు నిర్వహించేందుకు పరిశీలిస్తున్నామని.. లేనట్లయితే సంక్రాంతి తరువాత నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని ఆ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మంగళవారం వార్డుల పునర్విభజన, 2011 లెక్కల ప్రకారం ఓటర్ల జాబితాల తయారీ ప్రక్రియ అన్ని పట్టణాల్లోనూ ఇప్పటికే ప్రారంభమైందని చెప్పారు. విజయవాడ, విశాఖపట్నంతోపాటు మరికొన్ని చోట్ల చుట్టూ ఉన్న ప్రాంతాలను విలీనం చేస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాలు, తాజాగా వచ్చిన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని అన్నారు. వీటిపై సాధ్యమైనంత వేగంగా స్పష్టతనివ్వాలని భావిస్తున్నామని చెప్పారు.
* కమీషన్లపైనే టీడీపీ దృష్టి: విజయసాయిరెడ్డి
‘‘టీడీపీ ప్రభుత్వం ప్రాజెక్టు కమీషన్లపైనే దృష్టి పెట్టింది. ప్రజా సంక్షేమం వారికి పట్టలేదు. పోలవరంలో రివర్స్‌ టెండరింగ్‌తో ఆంధ్ర సీఎం రూ.780 కోట్లు ఆదా చేశారు’’ అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘‘కిలోమీటర్ల లెక్కన లీజుకు తీసుకునే ఎలక్ట్రిక్‌ బస్సుల నిర్వహణతో ఆర్టీసీకి ఏం సంబంధం చంద్రబాబు గారూ. దానికి ఒప్పుకోనందుకే మీరు నియమించిన సురేంద్రబాబుని బదిలీ చేశారని దిక్కుమాలిన వాదన చేస్తున్నారు. హైర్‌ బస్సుల నిర్వహణ ఎక్కడైనా వాటి యాజమాన్యాలే చేస్తాయి కదా?’’ అని ఓ ట్వీట్‌లో ప్రశ్నించారు.
* మాతృభాషను గౌరవించాలి: వెంకయ్య
సమాజంలో ఆంగ్లభాషా వ్యామోహం పెరిగిఇంగ్లీ షు చదువుతోనే ఉన్నతస్థాయికి చేరుకుంటామనే భావన పెరిగిపోతోందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను ఆంగ్లంతో అనుసంధానం చేయడమే అందుకు కారణమన్నారు. బుధవారం శాంతా వసంత ట్రస్టువిశ్వనాథ సాహిత్య పీఠం ఆధ్వర్యంలో గీతాంజలివేయిపడగలుఅమృ తం కురిసిన రాత్రి రచనల అనువాదాలు-సమస్యలుఅంశంపై నిర్వహించి న సదస్సు ముగింపు సభకు ఆయన హాజరై మాట్లాడారు.
* నామినేష‌న్ వేసిన ఆదిత్య థాక‌రే.. ఆస్తి 16.05 కోట్లు
శివ‌సేన నేత ఆదిత్య థాక‌రే ఇవాళ నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ముంబైలోని వ‌ర్లీ సీటు నుంచి ఆదిత్య పోటీ చేయ‌నున్నారు. ఈనెల 21న జ‌ర‌గ‌నున్న‌ మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో శివ‌సేన పార్టీ చీఫ్ ఉద్ద‌వ్ థాక‌రే కుమారుడు ఆదిత్య థాక‌రే పోటీలో నిలుస్తున్నారు. ముంబై ఓట‌ర్లు ఆదిత్య‌కు మ‌ద్ద‌తు ఇస్తార‌ని ఆశిస్తున్న‌ట్లు ఉద్ద‌వ్ తెలిపారు. త‌మ కుటుంబంలో సామాజిక సేవ చేసే సాంప్ర‌దాయం ఉంద‌ని, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కూడ‌ద‌ని ముందు అనుకున్నాం, కానీ ప‌రిస్థితులు మారాయి, నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల కోసం ఆదిత్య ఎప్పుడూ అండ‌గా ఉంటార‌ని భావిస్తున్న‌ట్లు ఉద్ద‌వ్ తెలిపారు. భ‌విష్య‌త్తులో ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌బోన‌ని శివ‌సేన చీఫ్ ఉద్ద‌వ్ స్ప‌ష్టం చేశారు. నామినేష‌న్ దాఖ‌లుకు ముందు ఇవాళ‌ ముంబైలో భారీ రోడ్‌షో నిర్వ‌హించారు. నామినేష‌న్ దాఖ‌లు చేసేందుకు వెళ్లే ముందు ఆదిత్య‌.. ఇంట్లోనే శివ‌సేన వ్య‌వ‌స్థాప‌కుడు, తాత‌య్య బాలా సాహేబ్ థాక‌రే ఫోటో వ‌ద్ద ఆస్సులు తీసుకున్నారు. ఆదిత్య థాక‌రే త‌న ఆస్తుల వివ‌రాల‌ను ప్ర‌క‌టించారు. ఆయ‌న ఆస్తి మొత్తం 16 కోట్ల 5 ల‌క్ష‌లు. అతని వ‌ద్ద ఓ బీఎండ‌బ్ల్యూ కారు కూడా ఉన్న‌ది. ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో ఈ వివ‌రాల‌ను ఆదిత్య పేర్కొన్నారు.