DailyDose

బ్రేక్ ఇన్స్పెక్టర్ ఇంటిపై ఏసీబీ దాడి-తాజావార్తలు-03/10

ACB Raids Break Inspector-Telugu Breaking News-10/03

* ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు, భారీగా అక్రమ ఆస్తులు గుర్తింపు.
* కేంద్ర పంచాయితి రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కి చంద్రబాబు లేఖ ఉపాధిహామీ పెండింగ్ బిల్లులు చెల్లింపునకు చొరవ తీసుకోవాలని లేఖలో మంత్రిని కోరిన చంద్రబాబు 2014-2019 మధ్య ఉపాధి హామీ పథకాన్ని ఏపీ రాష్ట్రం సమర్థంగా నిర్వహించి దేశంలోనే ప్రధమ స్థానంలో నిలిచిందని గుర్తు చేసిన చంద్రబాబు
* రేపు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ పర్యటనఉదయం 10:30 గంటల ప్రాంతంలో ప్రభుత్వ వైద్యకళాశాలకు శంకుస్థాపన చేయనున్న సీఎంతర్వాత ఇండోర్‌స్టేడియం గ్రౌండ్స్‌లో వైయస్సార్‌ వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించనున్న సీఎంరాష్ట్రవ్యాప్తంగా సొంతంగా ఆటోలు, కార్లు నడుపుకుంటున్న వారికి ఏడాదికి రూ.10వేలు చొప్పున ఈ పథకం కింద పంపిణీ
* హైదరాబాద్ నగరంలోని మాసబ్‌ట్యాంక్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ నేడు పలు ప్రభుత్వ కార్యాలయాలను ప్రారంభించారు. పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల కార్యాలయాలను ప్రారంభించారు.
* దేశ రాజధాని ఢిల్లీలోకి నలుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు చొరబడినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ నలుగురు కూడా భారీ ఆయుధాలతో ప్రవేశించినట్లు తెలిపాయి. రద్దీ ఉండే ప్రాంతాల్లో దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
* కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఇంట్లో చోరీ వెలుగులోకి వచ్చింది. నమ్మకంగా వుంటూనే గత మూడేళ్లుగా గోయల్ నివాసం(ముంబైలోని నేపీన్సీ రోడ్‌లోని ఖరీదైన ఎత్తైన విల్లా ఓర్బ్‌)లో పనిచేస్తున్న విష్ణుకుమార్ విశ్వకర్మ (28)ఈ చోరీకి పాల్పడ్డాడు. గత నెల (సెప్టెంబరు) 16 -18 మధ్య మంత్రి ఇంట్లోని వెండి, ఇతర విలువైన వస్తువులు మాయం కావడంతో ఆయన కుటుంబ సభ్యులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు.
* కడప చాపాడు మండలం బద్రిపల్లెలో వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. గ్రామ సచివాలయ ప్రారంభోత్సవానికి ఒక వర్గానికే ప్రాధాన్యత ఇచ్చారని.. ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై మరో వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఎమ్మెల్యే ఫ్లెక్సీలు చించివేశారు.
* కేంద్ర మాజీ మంత్రి, పాటలీపుత్ర ఎంపీ రామ్ కృపాల్ యాదవ్‌కు తృటిలో పెనుప్రమాదం తప్పింది. తన నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ట్యూబ్ల బోటులో ప్రయాణిస్తున్న ఆయన.. అదుపు తప్పి నదిలో పడిపోయారు.
* మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అండర్‌ వరల్డ్‌ డాన్‌ ఛోటా రాజన్‌ సోదరుడు దీపక్‌ నికాల్జే పోటీ చేయనున్నాడు. కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథావలే నేతృత్వంలోని రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్‌పిఐ) అభ్యర్థిగా దీపక్‌ పోటీ చేస్తున్నాడు. ఛోటా రాజన్‌ స్వస్థలమైన ఫల్తాన్‌ నియోజక వర్గంనుంచి దీపక్‌ పోటీ చేస్తున్నాడు. అతడి ఎన్నికల గుర్తు కమలం. ఇది బిజెపి చిహ్నం కావడం గమనార్హం. ఆర్‌పిఐ ప్రస్తుతం బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. ఆర్‌పిఐతో కుదిరిన ఒప్పందం మేరకు బిజెపి ఆ పార్టీకి ఆరు స్థానాలు కేటాయించింది.
* బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా నేటి నుంచి నాలుగు రోజులపాటు భారత్లో పర్యటించనున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సుకు అనుబంధంగా గురు, శుక్రవారాల్లో జరగనున్న భారత ఆర్థిక సదస్సులో హసీనా ప్రసంగించనున్నారు. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది.
* ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో నేడు మావోయిస్టు పార్టీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. గత నెల 22, 23న గూడెంకొత్తవీధి మండలం గుమ్మిరేవుల పంచాయతీలో జరిగిన రెండు ఎదురుకాల్పుల ఘటనలో అయిదుగురు మావోయిస్టులు మృతి చెందగా, మరొక మహిళా మావోయిస్టు నాయకురాలు గాయాలతో పట్టుబడిన సంగతి తెలిసిందే.
* నైరుతి రుతుపవనాలు దాదాపు నిష్క్రమించిన తరుణంలో రాయలసీమ ప్రాంతంలో గురు, శుక్రవారాలు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆర్టీజీఎస్‌ తెలిపింది. కోస్తాంధ్రలో చెదురుమదురుగా జల్లులు పడే అవకాశాలున్నట్టు పేర్కొంది. కాగా, బుధవారం ఉత్తరాంధ్రలోని భీమునిపట్నం, బుచ్చయ్యపేట, మందస, గాజువాకల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.
* బీసీల అభ్యున్నతికి కృషి చేస్తానని తెలంగాణ బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గంగుల కమలాకర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని బీసీ కమిషన్‌ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనపై విశ్వాసంతో సీఎం కేసీఆర్‌ రెండు శాఖలు అప్పగించడం సంతోషమన్నారు
* కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో సీబీఐ అధికారులు చిదంబరాన్ని ఆగస్టు 21న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న చిదంబరానికి సెప్టెంబర్ 5న కోర్టు జ్యూడీషియల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ సోమవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
*తెలుగు సాహిత్యానువాదం అన్ని భాషల్లోకి విస్తృతంగా జరగాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సాహిత్య అనువాదం వల్ల తెలుగు సంస్కృతీ సంప్రదాయాలతోపాటు ఇక్కడి రచయితలు, దేశభక్తులు, ప్రజానేతల గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసే అవకాశం ఉంటుందన్నారు.
*టెస్టుల్లో అనేక వైఫల్యాల తర్వాత ఓపెనర్ అవతారం ఎత్తిన భారత సీనియర్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ.. కొత్త పాత్రలో సులువుగా ఒదిగిపోయాడు. ఓపెనర్గా తొలి మ్యాచ్లోనే సెంచరీ సాధించాడు. బుధవారం విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో మొదలైన తొలి టెస్టులో రోహిత్ (115 నాటౌట్) సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 202 పరుగులు చేసింది.
*రాష్ట్రంలో 1,254 గ్రామ, వార్డు సచివాలయాలు బుధవారం ప్రారంభమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో 1,138, పట్టణాల్లో 116 సచివాలయాలు అందుబాటులోకి వచ్చాయి. మండలానికి, పురపాలక సంఘానికి ఒకటి చొప్పున మొదటి విడతగా వీటిని ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లా కరపలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గ్రామ సచివాలయాన్ని లాంఛనంగా ప్రారంభించి అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
*శాసనసభ ఫర్నిచర్ వ్యవహారంలో కోడెల శివరామ్కు హైకోర్టులో ఊరట లభించింది. ఈనెల 9లోపు దిగువ కోర్టులో లొంగిపోయి బెయిలు పొందాలని కోర్టు ఆయనకు స్పష్టం చేసింది. రూ.20 వేల చొప్పున రెండు పూచీకత్తులు తీసుకొని బెయిలు మంజూరు చేయాలని మెజిస్ట్రేట్ను ఆదేశించింది.
*ఉపాధి హామీ పథకం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడం చట్టవిరుద్ధమని పంచాయతీరాజ్ ఛాంబర్ జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడుతున్నామని చెప్పారు.
*జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(నరేగా)లో కూలీలకు ఈ ఏడాది ఇప్పటివరకు 14.93 కోట్ల పని దినాలు కల్పించామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
*దిల్లీ, విజయవాడలను కలుపుతూ తిరుపతికి విమాన సర్వీసులను నడిపేందుకు ఎయిర్ ఇండియా ముందుకు వచ్చింది. ఈ నెల 27 నుంచి ఈ సర్వీసులు ప్రారంభం కానున్నట్లు తిరుపతి విమానాశ్రయం సంచాలకుడు ఎస్.సురేష్ తెలిపారు. 170 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన ఎయిర్బస్-320 విమానం దిల్లీలో ఉదయం ప్రారంభమై గన్నవరం(విజయవాడ) మీదుగా ఇక్కడికి ఉదయం 9.45 గంటలకు చేరుకుంటుందని అన్నారు. 10.15 గంటలకు ఇక్కడి నుంచి గన్నవరం మీదుగా దిల్లీకి బయలుదేరి వెళ్తుంది. ప్రతి మంగళ, శుక్ర, ఆదివారాలు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
*గ్రామ సచివాలయ సర్వేయర్లగా ఎంపికైన వారికి సర్వే శాఖ 125 రోజులపాటు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనుంది. ప్రతి జిల్లాలో రెండు, మూడు కేంద్రాల్లో ఈ శిక్షణ కార్యక్రమాలు జరగనున్నాయి. సర్వే హద్దుల గుర్తింపు, ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ వినియోగం, క్యాడ్ సాఫ్ట్వేర్, ఇతర అంశాల్లో అభ్యర్థులకు శిక్షణ ఇస్తామని అధికారులు పేర్కొన్నారు
,*దేశవ్యాప్తంగా కోటి స్మార్ట్ ఎల్ఈడీ వీధిదీపాలను అమర్చితే అందులో 28.88లక్షలు ఆంధ్రప్రదేశ్వే కావటం విశేషమని కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్.కె.సింగ్ ప్రశంసించారు. కోటి ఎల్ఈడీ వీధిదీపాలను జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని మంగళవారం దిల్లీలో నిర్వహించారు.
*హైకోర్టుకు ఈనెల 3 నుంచి 11వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. అత్యవసర వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ ఎం.గంగారావు ఈ నెల 11న(శుక్రవారం) విచారణ జరపనున్నారు. 14న హైకోర్టు పునః ప్రారంభం అవుతుంది.
*ఒకటి రెండు రోజుల్లో ఉల్లి ధరలు అందుబాటులోకి వస్తాయని మార్కెటింగ్, పశుసంవర్ధకశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. మంగళవారం సచివాలయంలో మార్కెటింగ్శాఖపై సమీక్ష అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఇప్పటిదాకా 653 టన్నుల ఉల్లిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ధరలు తగ్గేదాకా కిలో రూ.25 చొప్పున అన్ని రైతుబజార్లలో అందిస్తామన్నారు.
*మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ‘అహింసా మార్గంలో భరతమాతకు బానిస సంకెళ్ల నుంచి విముక్తి కల్పించిన మహనీయుడు మహాత్మా గాంధీ. ఆయన ఆచరించి చూపిన అహింస, శాంతి నేడు ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయి.
*గూడూరు- విజయవాడ మధ్య ఇటీవల కొత్తగా ప్రవేశపెట్టిన రైలునెంబరు 12743/12744 ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలుకు ‘విక్రమసింహపురి అమరావతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్’గా పేరు మార్చుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
*పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి అవకాశాలను మెరుగుపరచేలా పారిశ్రామిక విధానం ఉండాలని, డిసెంబరు నెలాఖరుకు విధాన రూపకల్పన జరగాలని పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి అన్నారు. మంగళవారం సచివాలయంలో పరిశ్రమలు, ఐటీ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘విశాఖపట్నం, దొనకొండతోపాటు అన్ని జిల్లాలూ సమగ్రాభివృద్ధి సాధించేలా విధానం ఉండాలి. పరిశ్రమల స్థాపనకు కేంద్రం ఇచ్చే ప్రోత్సాహకాల ప్రయోజనాలు రాష్ట్రానికి ఎక్కువగా అందాలి. అని సూచించారు.
*అంతరిక్ష కార్యక్రమాలను సామాన్యుల చెంతకు తీసుకెళ్లేందుకు ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు ప్రపంచ వ్యాప్తంగా అంతరిక్ష వారోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో వారోత్సవాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షలు నిర్వహించనున్నారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు. దీంతో పాటు షార్ సందర్శనకు విద్యార్థులకు ఈనెల 4 నుంచి 9వ తేదీ వరకు అనుమతి ఇస్తారు.
*గుంటూరు జిల్లాలోని తాడేపల్లి పురపాలక సంఘానికి ప్రథమ శ్రేణి స్థాయి కల్పిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. స్థాయి పెంపునకు ఇప్పటికే పాలకవర్గం తీర్మానం చేయడంతోపాటు, రెండు సంవత్సరాల ఆదాయ, వ్యయాలను అధికారులు ప్రభుత్వ పరిశీలనకు పంపారు. వీటిని పరిశీలించిన అనంతరం మొదటి శ్రేణి స్థాయి కల్పించారు.
*అటవీశాఖలో క్షేత్రస్థాయి పోస్టుల్లో 56శాతం ఖాళీలున్నాయని, వచ్చే జనవరిలో వీటి భర్తీకి ప్రభుత్వం అంగీకరించిందని అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి(పీసీసీఎఫ్) ఎన్.ప్రతీప్కుమార్ వెల్లడించారు. ఇకపై ఏటా వెయ్యి మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని వేలంలో విక్రయించేందుకు అనుమతించాలంటూ కేంద్రాన్ని కోరనున్నామని ఆయన పేర్కొన్నారు.
*విపత్తుల సమయంలో వినియోగించే నీటిని తోడే పంపులు, అగ్నిమాపక పరికరాలు, లైఫ్ జాకెట్లు, మాస్క్లు, టార్పాలిన్లు, అత్యవసర రెస్క్యూ స్ట్రెచర్ల కొనుగోలుకు ప్రభుత్వం రూ.5.91 కోట్లు కేటాయించింది.
*వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింద ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం ఈ నెల 4న వారి ఖాతాల్లో జమ కానుంది. 1.75 లక్షల మంది ఆర్థిక సాయానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో దాదాపు అన్ని దరఖాస్తుల పరిశీలన మంగళవారంతో పూర్తిచేశారు. 4న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఈ పథకాన్ని ఏలూరులో ప్రారంభించనున్నారు. జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆరంభిస్తారు.
*ఏలూరులో ప్రభుత్వ మెడికల్ కళాశాల స్థాపించాలన్న జిల్లా ప్రజల కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈనెల 4న శంకుస్థాపన చేయనున్నారని ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని తెలిపారు. మంగళవారం ఏలూరులో ప్రభుత్వాసుపత్రి ఆవరణను ఆయన పరిశీలించి మాట్లాడారు.
* గుజరాత్‌ వడోదరలోని ఓ ఇంట్లో ప్రవేశించిన 9 అడుగుల కొండచిలువ. ఓ పెద్ద జంతువును మింగే ప్రయత్నం చేసింది. అది పెద్దదిగా ఉండటంతో చివరకు కక్కేసింది.
* తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. సర్వదర్శనానికి 16 గంటల సమయం.. ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.
* మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న శివసేన అధినేత ఉద్ధవ్‌ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే నేడు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయనున్నారు. వర్లి నియోజక వర్గంనుంచి ఆదిత్య థాకరే పోటీ చేస్తున్నారు. నామినేషన్‌ దాఖలు సమయంలో మొత్తం థాకరే కుటుంబమంతా ఆదిత్య థాకరే వెంట ఎన్నికల సంఘం కార్యాలయానికి వస్తుందని భావిస్తున్నారు.