దుర్గమ్మను మాజీ మంత్రి దేవినేని ఉమ దర్శనం చేసుకున్నారు. క్యూ లైన్‌లో నడుచుకుంటూ వెళ్లి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈసారి అధికార పార్టీ నేతల హడావుడే ఎక్కువుగా కనిపించిందని ఆరోపించారు. ఫ్లెక్సీలు ఎక్కువ పని తక్కువ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. వంద రూపాయల టిక్కెట్లను వీఐపీ ముద్రలు వేసి అమ్ముకుంటున్నారని విమర్శించారు. ఏ మంత్రి అండదండలతో ఇదంతా జరుగుతుందని ప్రశ్నించారు. అమ్మవారి టిక్కెట్లను కూడా రీసైక్లింగ్ చేస్తున్నారన్నారు. సాధారణ భక్తులు మాత్రం గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కానీ అధికార పార్టీ నేతలు మాత్రం రాజమార్గంలో వెళ్తున్నారన్నారు. ప్రజల ఆదాయాలు తగ్గిపోయాయి.. రోజు గడవటమే కష్టంగా ఉందని చెప్పారు. అందుకే ఈసారి దసరా ఉత్సవాలకు భక్తులు సంఖ్య తగ్గిందన్నారు. దాతలు ఇచ్చిన సొమ్ములో అరవై కోట్లు ఉన్నాయన్నారు. ఆ వడ్డీతో మంచి భోజనం పెట్టాలని కోరారు.
దుర్గమ్మను దోపిడీ చేస్తున్న వైకాపా
Related tags :