బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో సినిమా అనగానే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి, అంచనాలు ఏర్పడుతుంటాయి. ఆ కలయికలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు ఎంతటి విజయం సాధించాయో… అంతకుమించి అభిమానుల్లో సంతోషాన్ని నింపాయి. ఆ ఇద్దరూ కలిసి ముచ్చటగా మూడో సినిమా చేయబోతున్నారు. డిసెంబరు నుంచి ఆ చిత్రం మొదలు కాబోతోంది. మిర్యాల రవీందర్రెడ్డి నిర్మించబోతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇందులో బాలకృష్ణ రెండు కోణాల్లో సాగే పాత్రలో సందడి చేయబోతున్నారట. ఒక పాత్ర కోసం ఆయన 25 కిలోల బరువు తగ్గబోతున్నారు. అందుకోసం ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టారు. రోజుకి 5 గంటలు చొప్పున జిమ్లో చెమటోడుస్తున్నారు. వైట్ రైస్కి దూరంగా ఉంటూ ఆహార నియమాలు పాటిస్తున్నారట. ఇప్పటికే ఆయన 15 కిలోల బరువు తగ్గినట్టు సమాచారం. బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు.
బరువును నరుకుతున్న బాలయ్య
Related tags :