DailyDose

తహసిల్దారు ఆత్మహత్య – నేటి నేర వార్తలు -03/10

Nizamabad Rural MRO Commits Suicide-Telugu Crime News Today-10/03

* నిజామాబాద్ రూరల్ తహసీల్ధార్ జ్వాల గిరిధర్ రావ్ ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య నిజామాబాద్ ఆర్యనగర్ లో ఘటన నల్గొండ జిల్లా రామగిరి మండలానికి చెందిన తహశీల్ధార్ జ్వాల గిరిధర్. ఏడాది క్రితమే నిజామాబాద్ రూరల్ ఎమ్మార్వోగా గిరిధర్ బాధ్యతలు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఎం ఆర్ ఎం రావు. ఆర్డీఓ, ఏసీపీ శ్రీనివాస్ రావ్ విచారణ జరుపుతున్న పోలీసులు
* ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు, భారీగా అక్రమ ఆస్తులు గుర్తింపు.
* చిత్తూరులో వంట గ్యాస్ సిలిండర్ పేలి 6 గురికి తీవ్రగాయాలు…
*పొలం, వ్యవహారంలో తాము చెప్పిన మాటను వినడం లేదని అక్కసుతో సొంత తండ్రినే దారుణంగా నరికి చంపారు ఇద్దరు కొడుకులు తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలంలో దొండగూడెం గిరిజన గ్రామంలో జరిగిన ఘటన ఇది.
* భారత్ – పాక్ మధ్య బోర్డర్లో నిత్యం ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మరోవైపు భారత్ లో ఆత్మాహుతి దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
* మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అండర్‌ వరల్డ్‌ డాన్‌ ఛోటా రాజన్‌ సోదరుడు దీపక్‌ నికాల్జే పోటీ చేయనున్నాడు. కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథావలే నేతృత్వంలోని రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్‌పిఐ) అభ్యర్థిగా దీపక్‌ పోటీ చేస్తున్నాడు. ఛోటా రాజన్‌ స్వస్థలమైన ఫల్తాన్‌ నియోజక వర్గంనుంచి దీపక్‌ పోటీ చేస్తున్నాడు. అతడి ఎన్నికల గుర్తు కమలం. ఇది బిజెపి చిహ్నం కావడం గమనార్హం. ఆర్‌పిఐ ప్రస్తుతం బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. ఆర్‌పిఐతో కుదిరిన ఒప్పందం మేరకు బిజెపి ఆ పార్టీకి ఆరు స్థానాలు కేటాయించింది.
* కేంద్ర మాజీ మంత్రి, పాటలీపుత్ర ఎంపీ రామ్ కృపాల్ యాదవ్‌కు తృటిలో పెనుప్రమాదం తప్పింది. తన నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ట్యూబ్ల బోటులో ప్రయాణిస్తున్న ఆయన.. అదుపు తప్పి నదిలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఎంపీని రక్షించారు. వివరాల్లోకి వెళితే.. వరదలతో అతలాకుతలమైన ధనురువా గ్రామ పరిశీలనకు ఎంపీ కృపాల్ యాదవ్ బుధవారం రాత్రి వెళ్లారు. నదికి అవతలి గట్టున్న ప్రాంతాన్ని పరిశీలించాలనుకున్న ఆయన.. సమయానికి పడవ అందుబాటులో లేకపోవడంతో.. గ్రామస్థులు ఉపయోగించే టైర్ల ట్యూబ్‌లతో తయారు చేసిన పడవలో బయలుదేరారు. ఆయనతో పాటు మరికొంతమంది అది ఎక్కారు. దీంతో అదుపుతప్పి నీటిలో పడిపోయారు. వెంటనే స్థానికులు అలర్ట్ అయ్యి.. ఆయన్ను సురక్షితంగా వెలికి తీశారు. తమ దగ్గరున్న తువాళ్లతో తడిబట్టలతో ఉన్న ఆయనకు సపర్యలు చేశారు
* ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 47 సంవత్సరాల వయసున్న ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా.. అతన్ని గుర్తు తెలియని బైక్ ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి కిందపడిపోయాడు. వెనుక నుంచి వస్తున్న గ్యాస్ లారీ ఆ వ్యక్తి పైనుంచి దూసుకెళ్లడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
* నిజామాబాద్ రూరల్ ఎమ్మార్వో జోలగిరి శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్యనగర్‌లోని అద్దె నివాసంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలాన్ని కలెక్టర్ రామ్మోహన్‌రావు, పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మార్వో ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
* తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని లలితా జ్యువెలరీ షోరూంలో భారీ చోరీ జరిగింది. రూ. 50 కోట్ల విలువైన నగలను దుండగులు చోరీచేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తిరుచిరాపల్లి సత్రం బస్‌స్టేషన్‌ దగ్గర లలితా జ్యువెలరీ షోరూం ఉంది. అందులో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ప్రదర్శన కోసం ఉంచిన నగలు బుధవారం ఉదయానికి మాయమయ్యాయి. దీన్ని గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు.
* అమెరికాలో యుద్ధ విమానం కుప్పకూలిపోయింది. ఈశాన్య అమెరికా రాష్ట్రం కనెక్టికట్‌లోని బ్రాడ్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సంభవించిన ఈ ఘోర ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. నిన్న (బుధవారం, అక్టోబర్ 2) ఉదయం 9:54 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
* తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మడికి జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా చిన్నారితో సహా 5 గురికి తీవ్ర గాయాలైనట్లు హైవే పెట్రోలింగ్ సిబ్బంది తెలిపారు.
* సామర్లకోట మేడపాడు బాణా సంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదంలో మరో ఇద్దరు మృతి..కాకినాడ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బత్తిన లోవకుమారి (50), కాకర అనిత (30) మృతి.. నాలుగు చేరిన మృతుల సంఖ్య.. తీవ్రగాయాలతో చికిత్స పొందుతోన్న మరో 4గురు మహిళలు..
* తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం కోమరాజు లంక కు చెందిన కొమ్మిరెడ్డి వెంకటేశ్వర్లు అనే బెల్టు షాపు నిర్వాహకుడు నుంచి వివిధ బ్రాండ్ లకు చెందిన 110 మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకుని కేస్ నమోదు చేసిన ఎస్సై పి.బుజ్జిబాబు
*అభం శుభం తెలియని ఆ చిన్నారి చేసిన పాపం ఆడపిల్లగా పుట్టడమే. లోకాన్ని చూసి నెల రోజులైనా కాకుండానే కన్నతండ్రి కర్కశత్వానికి కడతేరిపోయింది. ఈ అమానవీయ ఘటన కొత్తగూడెం జిల్లా చర్ల మండలం రేగుంటలో ఆదివారం చోటుచేసుకుంది.
*ములుగు జిల్లా మంగపేట మండలం జబ్బోనిగూడెం సమీపంలో ఓ మహిళ పిడుగుపాటుకు మృతిచెందగా.. ఐదుగురు గాయపడ్డారు
*తప్పుడు పత్రాలతో రుణం తీసుకున్న ప్రైవేటు సంస్థ యాజమాన్యంతోపాటు వారికి సహకరించిన బ్యాంకు అధికారిపైనా హైదరాబాద్ సీబీఐ విభాగం కేసు నమోదు చేసింది. వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఉత్పత్తుల అమ్మకం కోసం ఎన్.ఎ.ఆర్. ట్రేడర్స్ అండ్ ఎంటర్ప్రైజస్ పేరుతో టి.లక్ష్మినారాయణ అనే వ్యక్తి కోటకొండ కృష్ణప్రసాద్తో కలిసి 2014లో ఓ సూక్ష్మ మధ్య స్థాయి వ్యాపార సంస్థ ఏర్పాటు చేశాడు.
*ఎలాంటి అనుమతులూ లేకుండా ఓ ఇంట్లో బాణసంచా తయారు చేస్తుండగా పేలుడు సంభవించి ఇద్దరు మహిళలు మృతిచెంచారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
*మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్రామ్పై కేసు నమోదైంది. క్రషర్ ఇండస్ట్రీ పూర్తిగా తమకే ఇవ్వాలని భార్గవ్రామ్ బెదిరించారని శివరామిరెడ్డి అనే వ్యక్తి ఆళ్లగడ్డ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో భార్గవ్రామ్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
*ఎలాంటి అనుమతులూ లేకుండా ఓ ఇంట్లో బాణసంచా తయారు చేస్తుండగా పేలుడు సంభవించి ఇద్దరు మహిళలు మృతిచెంచారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
*హైదరాబాద్ పరిధి బాలానగర్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న ఎస్.సురేష్కుమార్ (56) తన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు.
*జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢికొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా… చిన్నారితో సహా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆలమూరు మండలం మడికి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మామిడూరు గ్రామానికి చెందిన చరుమూరి రామస్వామి (65) కారులోనే ప్రాణాలు వదిలారు. మిగిలిన ఐదుగురు కుటుంబ సభ్యులకు గాయాలు కావడంతో రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పెళ్లికి వెళ్లి వస్తుండగా తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది.
* పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బుధవారం ఒక రౌడీషీటర్‌ను గుర్తుతెలియని దుండగులు హతమార్చారు.
* అంతర్రాష్ట్ర క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా గుట్టును ప్రకాశం పోలీసులు రట్టు చేశారు. ప్రధాన సూత్రధారితోపాటుమందిని అరెస్టు చేశారు. వారి వద్ద రూ. లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ బుధవారం తెలిపిన వివరాలు… ఒంగోలుకు చెందిన పూసపాటి లక్ష్మయ్యపశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన కొమ్మిశెట్టి రమేష్‌ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలువురిని ఏజెంట్లుబుకీలుపంటర్‌లను ఏర్పాటు చేసుకుని కొన్నేళ్లుగా క్రికెట్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు.
* మనవడి మరణాన్ని జీర్ణించుకోలేకఅతడు మరణించిన చోటికే వెళ్లి ఆత్మహత్యకు పాల్పడిందో అమ్మమ్మ. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మంగళవారం జరిగిన ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది.