Food

రోజుకో చెంచాడు వెన్న…చలాకీదనం పెంచుతుంది

Telugu Food News | A spoon of butter a day keeps you active

ఇంట్లో తయారుచేసుకునే వెన్నలో కెలొరీలు తక్కువ. ప్రతిరోజు చెంచా వెన్న తింటే ఆరోగ్యపరంగా ప్రయోజనాలెన్నో. అవేంటంటే…
* ఇందులో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి తోడ్పడుతుంది. చర్మవ్యాధులను నివారిస్తుంది. చర్మాన్ని కాంతిమంతంగా చేస్తుంది. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
* వెన్నలోని డి విటమిన్ రక్తహీనత ఎదురుకాకుండా చేస్తుంది. శరీరానికి క్యాల్షియం అందుతుంది.
* ఇందులోని లెసిథిన్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది.
* వెన్నలో ఉండే ప్రత్యేక పోషకాలు మెదడును చురుగ్గా ఉంచుతాయి. నిత్యం ఉత్సాహంగా ఉంటారు. జ్ఞాపకశక్తీ మెరుగవుతుంది.
* ఆరోగ్యానికే కాదు, వెన్నతో అందమూ సొంతమవుతుంది. ఒంటికి వెన్న రాసుకుని అరగంట తరువాత నలుగుపెట్టుకుని స్నానం చేస్తే చర్మం కాంతులీనుతుంది. చలిగాలికి పెదాలు పొడిబారినట్లు అనిపిస్తే, కాస్తంత వెన్నను నిద్రపోయే ముందు పెదాలకు రాస్తే చాలు. మృదువుగా మారతాయి.