NRI-NRT

వైభవంగా తామా దసరా వేడుకలు

TNILIVE Atlanta Telugu News | TAMA 2019 Dasara Batukamma Grand Success

మెట్రో అట్లాంటా తెలుగు సంఘం(తామా) ఆధ్వర్యంలో దసరా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డా.కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ సమర్పణలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రవాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శశికళ పెనుమర్తి, నీలిమ గడ్డమణుగు, శాంతి మేడిచెర్ల, శ్రీదేవి దాడితోట, హేమశిల్ప ఉప్పల, శ్రీవల్లి శ్రీధర్ మరియు మాధవి దాస్యంల కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిధిగా ఇండియా నుండి విచ్చేసిన ప్రముఖ జానపద గాయకులు డా|| శ్రీనివాస లింగా రాయలసీమ, కోస్తా ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాల యాసలతో పాటలు వినిపించడం అలరించింది. బతుకమ్మ ఆటను ప్రవాస మహిళలు, చిన్నారులు రెండు గంటల పాటు ఆడి నిమజ్జనం చేశారు. స్నేహ బుక్కరాయసముద్రం, కనకలక్ష్మి చింతల, గీత వేదుల న్యాయమూర్తులుగా జరిగిన బతుకమ్మ పోటీలలో విజేతలకు రమేష్ అన్నాబత్తుల, విజు చిలువేరులు బహుమతులు అందజేశారు. ప్రియా బలుసు ట్రివియా బహుమతులు, మహేష్ పవార్ కోలాటం కర్రలు స్పాన్సర్ చేశారు.

తామా అధ్యక్షుడు వెంకీ గద్దె, సభ్యులు భరత్ మద్దినేని, ఇన్నయ్య ఎనుముల, ప్రియా బలుసు, సుబ్బారావు మద్దాళి, సాయిరాం కారుమంచి, ఆదిత్య గాలి, రవి కల్లి, బిల్హన్ ఆలపాటి, సురేష్ బండారు, రూపేంద్ర వేములపల్లి, భరత్ అవిర్నేని, శ్రీవల్లి శ్రీధర్, వినయ్ మద్దినేని, రాజశేఖర్ చుండూరి, నగేష్ దొడ్డాక, కమల్ సాతులూరు, శ్రీనివాస్ ఉప్పు, విజు చిలువేరు, మహేష్ పవార్, రామ్ మద్ది, రామ్కిచౌడారపు, రమేష్ కోటికే, శ్రీనివాస్ కుక్కడపు, రమేష్ వెన్నెలకంటి, బాలనారాయణ మద్ద, శ్రీనివాస్ లావు, అంజయ్య చౌదరి లావు, అనిల్ యలమంచిలి, మురళి బొడ్డు, వెంకట్ మీసాల, విజయ్ రావిళ్ల, సురేష్ దూలిపుడి, మోహన్ ఈదర, శ్రీనివాస్ గుంటక, సుధాకర్ బొర్రా, యశ్వంత్ జొన్నలగడ్డ, విజయ్ బాబు కొత్త, ప్రభాకర్ కొప్పోలు, నాగరాజు, నవీన్, సాయిప్రశాంత్, శుశ్రుత, సంతోష్ కిరణ్ వరద, సరితా కోటికే, శ్రీదేవి, విజయ్, శివ మాలెంపాటి, వినోద్ రెడ్డి తుపిలి, గౌరీధర్, సత్య నాగేందర్ గుత్తుల, రాజ్ కిరణ్ తదితరులు వేడుకల విజయవంతానికి సహకరించారు.