Politics

ఏలూరులో రెండు కీలక పథకాలకు నేడు సీఎం శ్రీకారం

ఏలూరులో రెండు కీలక పథకాలకు నేడు సీఎం శ్రీకారం

ఈ రోజు ఏలూరు పర్యనటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. రెండు కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.

జిల్లా ఆస్పత్రిలో ప్రభుత్వ వైద్యకళాశాలకు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి… అనంతరం ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్దకు చేరుకుంటారు.

ఆటోలు, టాక్సీలు నడిపే వారికి ఏడాదికి 10 వేల ఆర్థిక సాయం చేస్తామన్న ఎన్నికల హామీ ప్రకారం ‘వాహనమిత్ర’ పథకాన్ని జగన్ ప్రారంభిస్తారు.

ఆటో, క్యాబ్ డ్రైవర్లతో ముఖాముఖి అనంతరం వారికి చెక్కులు అందిస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను పరిశీలిస్తారు.

గురువారం కురిసిన వర్షంతో సభాస్థలిలోకి ప్రవేశించిన నీటిని మోటార్ల సాయంతో అధికారులు బయటకు మళ్లించారు.

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి సుభాష్ చంద్రబోస్ గతం కంటే భిన్నంగా పనులకు నిధులు విడుదల చేశాకే శంకుస్థాపనలు చేస్తామని తెలిపారు.

వాహన మిత్ర పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా సొంతంగా ఆటోలు, కార్లు నడుపుతున్న వారికి ఏటా 10 వేల చొప్పున పంపిణీ చేస్తారు.

ఇందుకుగానూ రాష్ట్రవ్యాప్తంగా లక్షా 75 వేల 352 దరఖాస్తులు రాగా, లక్షా 73 వేల 102 మంది అర్హులను గుర్తించారు. వీరికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది.

ఇందులో లక్షా 56 వేల 804 ఆటోలు, 5 వేలా 93 మాక్సీ క్యాబ్‌లు, 11 వేల 205 టాక్సీలు నడుపుతున్నారు.