ఆహారంలో పీచుపదార్థం అవసరం. ఇది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఉదయానే్న మలవిసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది. రెండవది కీళ్లు, ఎముకలకు బలాన్ని ఇస్తుంది. ఆహార ప్రభావం ఆరోగ్యంపై ఉండటానికి కారణం పేగులో ఉండే సూక్ష్మజీవులు. పలు జాతుల సూక్ష్మజీవులు పేగుల్లో ఉంటాయి. ప్రతి ఒక్కమనిషి పేగులో దాదాపు రెండు కిలోల బరువు తూగే సూక్ష్మజీవులు ఉంటాయని అంచనా. మనం తీసుకున్న ఆహారపదార్థాలపై ఈ సూక్ష్మజీవులు ప్రభావం చూపుతాయి. పీచు పదార్థాలను పేగుగోడలు పీల్చుకోగలిగిన స్థాయికి తీసుకువస్తాయి. భిన్న సూక్ష్మజీవుల జాతులు సరైన సంఖ్యలో పేగులో ఉన్నప్పుడు పేగుగోడలు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రమాదకర సూక్ష్మజీవులు పేగు గోడలకు పుండ్లు పడనియ్యవు. ఇటువంటి ఆరోగ్యం అందించే బాక్టీరియాపేగులో ఉండాలి. వాటి సంఖ్యను పెంచి, వాటివల్ల లాభం కలిగేలా చేయగలిగిన శక్తి పీచు పదార్థానికి ఉంది. బాక్టీరియా సమతుల్యత లోపించినప్పుడు కీళ్ళనొప్పులు, ఎముకల బలహీనతలొస్తాయి.
పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి
Related tags :