Business

వడ్డీ రేట్లు తగ్గించిన RBI

RBI Cuts Interest Rates

ఆర్థిక వృద్ధి మందగమనం నేపథ్యంలో వడ్డీ రేట్లను మరోసారి తగ్గించింది ఆర్బీఐ.

మూడు రోజుల సమావేశంలో ద్రవ్య పరపతి విధాన కమిటీ తీసుకున్న నిర్ణయాల పూర్తి వివరాలు….

రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గింపు. 2019లో వరుసగా ఐదోసారి వడ్డీ కోత

తాజా కోతతో 5.15 శాతానికి చేరిన రెపో రేటు. 4.90 శాతంగా రివర్స్​ రెపో రేటు

25 బేసిస్ పాయింట్ల వడ్డీ కోతకు ద్రవ్య పరపతి విధాన కమిటీ సభ్యుల ఏకగ్రీవ ఆమోదం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి అంచనా 6.1 శాతానికి తగ్గింపు. అంతకుముందు 6.9 శాతంగా ఉన్న వృద్ధి అంచనా

ఆర్థిక వృద్ధి ఊతమిచ్చే విధానం కొనసాగించిన ఆర్బీఐ

ప్రభుత్వ ఉద్దీపన చర్యలతో డిమాండ్​ పెరుగుదల, పెట్టుబడుల వృద్ధికి అవకాశం

ఈ ఏడాది రెండో అర్ధ భాగంలో చిల్లర ద్రవ్యోల్బణం 3.5-3.7 శాతం ఉంటుందని అంచనా

అక్టోబర్ 1 నాటికి 434.6 బిలియన్ డాలర్లకు చేరిన విదేశీ మారకం నిల్వలు

తదుపరి ద్రవ్య పరపతి విధాన సమీక్ష డిసెంబర్​ 3-5 తేదీల్లో నిర్వహిస్తారు.