టెన్నిస్ ఆడడం ఆపాలని, లేకపోతే ఆరుబయట ఆడటం వల్ల చర్మం నల్లబడి ఎవరూ పెండ్లి చేసుకోరని చిన్నప్పుడు తనకు కొందరు సలహాలు ఇచ్చారని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వెల్లడించింది. అమ్మాయి అంటే తెల్లగా ఉండాలన్న భావన సమాజంలోని చాలామందిలో పాతుకుపోయిందని, ఇలాంటి సంస్కృతి మారాలని చెప్పింది. చిన్నప్పటి నుంచే ఆటలు ఆడేలా బాలికలను ప్రోత్సహించాలని సూచించింది. గురువారమిక్కడ జరిగిన ప్రపంచ వాణిజ్య సదస్సులో భాగంగా జరిగిన మహిళలు – నాయకత్వం అనే అంశం చర్చలో సానియా మీర్జా మాట్లాడింది. ప్రపంచకప్‌లో పాకిస్థాన్ వైఫల్యానికి తాను విమర్శలను ఎదుర్కొన్న అంశంపై ప్రశ్నించగా..‘నేను పాక్ జట్టులో లేను అలాంటప్పుడు గెలిపించేందుకు నాకెలాంటి శక్తులు కల్గి ఉండాలో అర్థం కావడం లేదు. విరాట్ కోహ్లీ డకౌట్ అయితే అతని భార్య అనుష్క శర్మను నిందించారు. అలా వ్యక్తిగత విమర్శలు చేయడం అర్థరహితం’ అని సానియా అంది. క్రికెటర్ల వెంట భాగస్వాము లు పర్యటనలకు వెళ్లకూడదన్న అంశంపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆటగాడి మనసును మహిళ మళ్లిస్తుందే.. కానీ అతడికి బలంగా ఉండలేదనే పరమార్థం ఆ నిబంధన వెనుక కనిపిస్తున్నదని చెప్పింది. గతేడాది బాబుకు జన్మనిచ్చిన సానియా కోర్టులో దిగేందుకు సిద్ధమవుతున్నది.
తప్పుడు మనుషులు….తప్పుడు సలహాలు ఇచ్చారు
Related tags :