ScienceAndTech

శ్రీహరికోటలో అంతరిక్ష వారోత్సవాలు

Space Conference In Sriharikota India

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లో అంతరిక్ష వారోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. వారోత్సవాలను ఎంఆర్‌ఆర్‌ కోఛైర్మన్‌ డాక్టర్‌ కె.నారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతరిక్ష పరిశోధనలో భారత్‌ ఎంతో ముందంజలో ఉందన్నారు. దేశంలో అంతరిక్ష పరిశోధనల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, వాటివల్ల ఎలాంటి ప్రయోజనం ఉందని చాలా మంది ప్రశ్నిస్తుంటారని ఆయన అన్నారు. అయితే దీపావళికి బాణాసంచా కాల్చేందుకు సుమారు 600 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తుంటారని అదే మంగళయాన్‌ ప్రయోగం కోసం ఇస్రో కేవలం రూ.1000 కోట్లు మాత్రమే ఖర్చు చేసి విజయం సాధించిందని గుర్తు చేశారు.