* మంచిర్యాలలో తుపాకుల కలకలం. మంచిర్యాల జిల్లాలో తుపాకుల కలకలం రేగింది. దీనికి సంబంధించి పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులున్నారు. ఈజీ మనీ కోసం తుపాకులతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫిర్యాదుతో డొంక కదిలింది. పాట్నా నుంచి తుపాకులు కొనుగోలు చేసినట్టు నిర్దారణ అయింది.
* అజ్ఞాతంలో మాజీ యం.పి హర్షకుమార్. కచ్చులూరు వద్ధ బోటు ప్రమాదంలో మ్రృతుల సంఖ్య 93 అంటూ ప్రకటన, ఆధారాలు చూపాలని నోటీసులు జారీ చేసిన పోలీసులు. రాజమండ్రిలో 921 గజాల స్ధలాన్ని న్యాయశాఖ కు అప్పగిస్తూ రెవిన్యూ అధికారులు ఉత్తర్వులు.
* హాలియా పట్టణంలోని సాగర్ రోడ్ లో గ్యాస్ సిలిండర్ పేలి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి…
* దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి వద్ద రెండు కార్లు ఢీకొని ఇద్దరు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు. క్షతగాత్రులను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలింపు
* వేంపల్లె లోని పులివెందుల రోడ్డులో నూతనంగా ఏర్పడిన మూడు ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద .. మితిమీరుతున్న మందుబాబుల ఆగడాలు..ఇబ్బంది పడుతున్న మహిళలు, విద్యార్థులు..బహిరంగంగా మద్యం సేవిస్తున్న మందుబాబులు..చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు..చదువుకోవడానికి పాఠశాలలకెళ్లే విద్యార్థులకు తప్పని తిప్పలు..మద్యం షాపు తెరవకముందే మద్యం ప్రియులు అక్కడ తిష్టవేసి ఎప్పుడు తెరుస్తారా అని ఎదురు చూపులు.. అదే సమయంలో స్కూల్ విద్యార్థులకు, ఆ దారిన పోయే మహిళలకు తీవ్ర ఇబ్బందులు.
* పాకిస్థాన్‌తో డాగ్‌ఫైట్ జరుగుతున్న సమయంలో భారత వైమానిక దళానికి చెందిన ఎంఐ 17 హెలికాప్టర్‌ను మనం ప్రయోగించిన క్షిపణే కూల్చిందని ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ భదౌరియా తెలిపారు. మన చాపర్‌ను మనం కూల్చివేయడం అతి పెద్ద తప్పిదమని ఆయన అన్నారు.
* ఆత్మకూరులో డి. ఎడ్ పేపర్ 5 ప్రశ్నపత్రం లీక్. ఇవాళ జరగనున్న పర్యాటక విద్యాపరిక్ష. ఒక్క రోజు ముందుగానే లీక్ అయిన ప్రశ్నాపత్రం. ఉదయం 8:30 గంటలకే విద్యార్థులు అందుతున్న వైనం
* మచిలీపట్నం మండలం రుద్రవరం పంచాయతీలో నలుగురు గ్రామ వాలంటీర్లను తొలగించారు. అభియోగాలు రుజువు కావడంతో ఎండీవో తొలగింపు ఉత్తర్వులు జారీచేశారు. లబ్ధిదారులకు పింఛన్ ఇచ్చాక దసరా మామూలు పేరిట వాలంటీర్లు వసూళ్లకు పాల్పడడంతో వారిని తొలగించారు.
* గుంటూరు జిల్లా కొర్నేపాడు గ్రామానికి చెందిన 12 మంది మహిళలు కూలిపనికి వెళ్లిన సమయంలో.. పిడుగుపాటుకు గురయ్యారు. గాయాలపాలైన వీరిని ఆసుపత్రికి తరలించారు.
* గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతున్న కారణంగా… ప్రమాదానికి గురైన బోటు వెలికితీత పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
* విద్యాశాఖలో మంత్రి కేటిఆర్ సంతకం ఫోర్జరీకి గురవడంతో కలకలం రేగింది. జిల్లా ఓపెన్ స్కూల్స్ కో ఆర్డినేటర్ పోస్ట్ కోసం కేటీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు. రావులపెంట జడ్పీ హైస్కూల్ హెడ్ మాస్టర్ మానవత్ మంగళ కోఆర్డినేటర్ పోస్టు కోసం కేటీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు. నకిలీ లెటర్ హెడ్‌తో పాటు కేటీఆర్ ఫోర్జరీ సంతకం లెటర్‌తో కోఆర్డినేటర్ పోస్ట్‌లో కొంతకాలంగా మంగళ కొనసాగుతున్నారు. తాజాగా సంతకం ఫోర్జరీ అని తేలడంతో మంగళపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. జిల్లా విద్యాశాఖ అధికారి తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.