పొడిచర్మం ఉన్నవాళ్లు స్నానం చేయగానే చర్మం బిగుసుకు పోయినట్టు అవుతుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలు…కొన్ని చుక్కలు ఆలివ్ ఆయిల్ లేదా సన్ఫ్లవర్ ఆయిల్ వేసిన పచ్చిపాలల్లో దూది ముంచి, చర్మాన్ని శుభ్రం చేయాలి. తరువాత చల్లని నీటితో చర్మాన్ని కడుక్కోవాలి.తేనె సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్. తేనెలో కొన్ని చుక్కలు నిమ్మరసం వేసుకొని, చర్మానికి రాసుకోవాలి. పావుగంట తరువాత కడుక్కుంటే చర్మం సున్నితంగా ఉండడమే కాకుండా పొడిబారడం తగ్గుతుంది. ప్రతిరోజూ 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగితే, చర్మాన్ని తేమగా ఉంచుకోవచ్చు. స్నానం చేయగానే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. పొడిచర్మానికి క్రీమీగా ఉండే మాయిశ్చరైజర్ అయితే బాగా పనిచేస్తుంది. స్నానానికి వెళ్లే ముందు ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరినూనెతో చర్మాన్ని మర్దనా చేసుకోవాలి. ఇలా మర్దనా చేసుకున్న తరువాత చల్లని లేదా గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి. కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ వేసిన నీటితో స్నానం చేయడం ద్వారా చర్మం తేమ కోల్పోకుండా ఉంటుంది. చిటికెడు పసుపు కలిపిన పాల మీగడను ప్రతిరోజూ ముఖానికి రాసుకోవాలి. తరువాత ముఖాన్ని శనగపిండి లేదా సున్నిపిండితో కడుక్కోవాలి. రాత్రిపూట నానబెట్టిన 4 లేదా 5 బాదం గింజల్ని పొద్దున్నే తొక్క వలిచి, మెత్తగా చేసుకోవాలి. అందులో కొన్ని పచ్చిపాలను కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని, పావుగంట తరువాత కడుక్కోవాలి. చర్మ ఆరోగ్యానికి బాదం మంచి ఔషధంలా పనిచేస్తుంది. గుడ్డు పచ్చసొన, మీగడ, రోజ్వాటర్లను కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని, కొంత సమయం తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం పొడిబారడాన్ని త్వరగా అరికట్టవచ్చు. తక్కువ నీటితో క్యారెట్ని ఉడికించి, అది చల్లారిన తరువాత మెత్తగా చేసుకొని, ముఖానికి రాసుకోవాలి. సున్నితమైన పొడి చర్మానికి బాగా పనిచేస్తుంది. ఔషధ గుణాలున్న కలబందని ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం చల్లబడుతుంది.. కూలెంట్లా పనిచేసే కలబంద గుజ్జులో, కొద్దిగా పసుపును కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయడం ద్వారా చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా తయారవుతుంది.
చలికాలం చర్మ సౌందర్య చిట్కాలు
Related tags :