తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర జూపార్క్‌లో సమీర్, రాణి అనే రెండు తెల్ల పులులు ఐదు పులిపిల్లలను జన్మనిచ్చాయి. ఈ ఐదింటిలో మూడు మగ పిల్లలు కాగా రెండు ఆడ పిల్లలు. విషయం తెలుసుకున్న రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జూపార్క్‌ను సందర్శించి పులిపిల్లలను పరిశీలించారు. మగ పులిపిల్లలకు వాసు, సిద్ధాన్, జగన్ అని, ఆడ పులిపిల్లలకు విజయ, దుర్గ అని మంత్రి నామకరణం చేశారు. కార్యక్రమంలో జూపార్క్ అధికారులు ప్రదీప్ కుమార్, నళినీమోహన్ తదితరులు ఉన్నారు.
తిరుపతి జూలో అయిదు తెల్లపులి పిల్లలు ఉన్నాయి

Related tags :