హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని జనసేన కార్యాలయానికి వెళ్లి కోరినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని కోరిన వెంటనే జనసేన ప్రతినిధులు సానుకూలంగా స్పందించారని వీహెచ్ అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అందుబాటులో లేరని.. ఆయన రాగానే కచ్చితంగా మద్దతు ప్రకటిస్తారని వీహెచ్ ధీమా వ్యక్తం చేశారు. జనసేన మద్దతుతో హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు. అక్కడ కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తోన్న కేసీఆర్ ఒక నియంతలా పాలన సాగిస్తున్నారని వీహెచ్ మండిపడ్డారు. త్వరలోనే హుజూర్‌నగర్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్తామని చెప్పారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని.. వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని వీహెచ్ డిమాండ్ చేశారు.
హుజూర్‌నగర్‌లో జనసేన-కాంగ్రెస్‌లు చెట్టాపట్టాల్!
Related tags :