పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలకు శంకుస్థాపన చేశారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో నూతన వైద్య కళాశాలను నిర్మించనున్నారు. అంతేకాకుండా వైకాపా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ‘వైఎస్ఆర్ వాహన మిత్ర’ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సొంతగా.. కార్లు, ఆటోలు నడుపుతున్న వారికి ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం అందించనున్నారు.
ఏలూరులో జగన్ పర్యటన

Related tags :