ఆన్‌లైన్‌లో కొనుగోలుదార్లకు నాణ్యమైన ఉత్పత్తులు, అందుబాటు ధరల్లో, సాధ్యమైనంత వేగంగా అందించేందుకే అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని అమెజాన్ ఇండియా డైరెక్టర్లు చెప్పారు. దేశీయంగా 5 లక్షల మంది వ్యాపారులు 20 కోట్లకు పైగా ఉత్పత్తులను తమ ప్లాట్‌ఫామ్‌పై విక్రయిస్తున్నారని..వీటిలో నుంచి తమకు కావాల్సినవి సులభంగా ఎంచుకుని, సౌకర్యవంతంగా అందుకునే వీలును వినియోగదార్లకు కల్పించేందుకు దేశవ్యాప్తంగా 99.6 శాతం పిన్‌కోడ్ (తపాలా కార్యాలయాల) పరిధిలో ఉత్పత్తులు డెలివరీ చేస్తున్నామని వివరించారు. గతంలో మొబైల్, అనుబంధ ఉపకరణాలే ఎక్కువగా అమ్ముడుపోయినా, ఇప్పుడు ఫర్నీచర్, భారీ గృహోపకరణాలు కూడా విరివిగా కొనుగోలు చేస్తున్నారని, వినియోగదార్లకు తమ పోర్టల్‌పై పెరుగుతున్న విశ్వసనీయతకు ఇది నిదర్శనమని తెలిపారు. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరిట దసరా-దీపావళి సీజన్‌లో నిర్వహిస్తున్న విక్రయాల్లో, గత మూడేళ్ల కంటే ఈ సంవత్సరమే అత్యంత భారీగా అమ్మకాలు నమోదవుతున్నట్లు వెల్లడించారు. ఇంట్లోని కుటుంబ సభ్యులందరికీ అవసరమైన దాదాపు 600 రకాల ఉత్పత్తులను ప్రదర్శిస్తున్న ‘అమెజాన్ ఫెస్టివ్‌యాత్ర’ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా తెలిపారు.
అమెజాన్ ఇండియాను భారతీయులు బానే వాడుకుంటున్నారు
Related tags :