* జూబ్లీహిల్స్ లో అర్ధరాత్రి నిర్మాత బండ్లగణేష్ హల్చల్. అనుచరులతో కలిసి పొట్లూరి వరప్రసాద్ ని బెదిరించిన బండ్ల గణేష్. జూబ్లీహిల్స్ పిఎస్ లో పివిఆర్ పిర్యాదు. నిర్మాత బండ్ల గణేష్ పై కేసు నమోదు. 420, 448, 506 ర్/వ్ 43, ఇప్చ్ సెక్షన్స్ కింద కేసు నమోదు.పరారీలో బండ్ల గణేష్, గాలిస్తున్న పోలీసులు.
* తిరుచ్చిలోని లలిత జ్యువెలర్స్‌లో జరిగిన భారీ దొంగతనం కేసులో ఓ నిందితుడు పోలీసులకు చిక్కాడు. తిరువారూర్ సమీపంలోని విళమల్ అడియక్కమంగలం చెక్ పోస్టు వద్ద గురువారం రాత్రి తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసి బైక్‌పై వస్తున్న ఇద్దరు దొంగలు వెనక్కి తిరిగి పరారయ్యారు. గుర్తించి అప్రమత్తమైన పోలీసులు వారిని వెంబడించారు. కిలోమీటరు దూరం వెంబడించిన తర్వాత ఓ దొంగ అట్టపెట్టతో పోలీసులకు పట్టబడ్డాడు. అందులో 4.5 కిలోల బంగారు నగలు కనిపించడంతో పట్టుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితుడిని తిరువారూర్‌కు చెందిన మణికంఠన్ (32)గా గుర్తించారు. పరారీలో ఉన్న మరో దొంగ కూడా అదే గ్రామానికి చెందిన సురేశ్ అని పోలీసులు తెలిపారు.
* భర్తను భార్య హత్య చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి మండలం పాతనౌపడలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో కిరోసిన్ పోసి హత్య యత్నించాడని భార్య ఆరోపిస్తోంది. కుమారుడితో పాటు తనపై హత్యకు యత్నించాడని భర్తపై భార్య ఆరోపణలు చేస్తోంది. ఆత్మరక్షణ కోసమే భర్తను హత్య చేశానని భార్య జగదీశ్వరి తెలిపారు. మృతుడు వెంకటరమణ (32). రైల్వే ట్రాక్ మ్యాన్ గా పనిచేసేవాడు.
* నెల్లూరు పోలీస్ స్టేషన్ లో వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎంపీడీవో సరళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఇంటిపై దౌర్జన్యం చేశారన్న ఎంపీడీవో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
* తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె యాదగిరిగుట్ట డిపో వద్ద ఉద్ధ్రిక్తంగా మారింది. బస్సు నడిపేందుకు సిద్ధమైన తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లపై సమ్మెల్లో పాల్గొన్న ఓ మహిళా కండక్టర్ దాడికి దిగారు. చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించగా.. అక్కడున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు డిపోలోని 470 మంది కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, కొందరికి ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాట్లు చేయాలనే సూచనల మేరకు ఆర్టీసీ అధికారులు అర్హత కలిగి కొందరు బయటి వ్యక్తులను విధుల్లోకి తీసుకున్నారు. దీంతో డిపో పరిధిలోని 105 బస్సుల్లో 20 బస్సులు కదిలాయి.
* TV9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ ఇంటికి వెళ్లిన పదిమంది పోలీసులు బృందం.రవిప్రకాశ్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లిన పోలీసులు. రవి ప్రకాష్ పై గతంలో అనేక కేసులు. ప్రస్తుతం బెయిలు మీద ఉన్న రవి. అరెస్టు కాకుండా చేసిన విశ్వ ప్రయత్నాలన్నీ విఫలం.