Food

సగ్గుబియ్యంతో బ్లడ్డే బ్లడ్డు

Saabu Daana For Treating Anaemia

వరాత్రి వేడుకల్లో కొందరు సగ్గుబియ్యాన్ని ఆహారంగా తీసుకుంటారు. దీన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే బోలెడు లాభాలున్నాయి తెలుసా…

* సగ్గుబియ్యంలో పిండిపదార్థాలు, ఖనిజాలు, విటమిన్లు అధికం. కొవ్వులు, సోడియం మోతాదు చాలా తక్కువ.

* బరువు తగ్గాలనుకునేవారికి ఇది చక్కటి పరిష్కారం. దీంట్లో మాంసకృత్తులు అధికం. కిచిడీలా చేసుకుని తింటే… కొన్ని గంటలపాటు ఆకలిగా అనిపించదు.

* వాంతులు, విరేచనాలు అవుతున్నప్పుడు సగ్గు బియ్యంతో పల్చని జావలా తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది. విరేచనాలు తగ్గుముఖం పడతాయి.

* ఇవి ఎముకలను దృఢంగా మారుస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల నరాల నొప్పులూ తగ్గుతాయి.

* రక్తహీనతతో బాధపడేవారు దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఆ సమస్య అదుపులో ఉంటుంది.