శరన్నవరాత్రులలోషష్ఠినాడు గానీ, సప్తమినాడు గానీ మూలా నక్షత్రం ఉంటుంది.ఆ రోజున అమ్మవారిని సరస్వతీ స్వరూపంగా, వాగ్దేవతగా పూజించటం సంప్రదాయం. సమస్తవిద్యలకూ మూలమైన తల్లి సరస్వతి. ఆమె మూలా నక్షత్రంనాడు అవతరించిందనివిశ్వసిస్తారు. అదే రోజు యాజ్ఞవల్క్య మహర్షి సరస్వతీ దేవిని అర్చించి ఆమెసాక్షాత్కారం పొందాడనీ, ఆ సమయంలోనే మహర్షి నోట సరస్వతీ సహస్రనామస్తోత్రం ఆవిర్భవించిందనీ దేవీభాగవతం చెబుతోంది. ‘సర్వ శుక్లా సరస్వతీ’ అన్నారు వ్యాసమహర్షి. అంటే తెల్లటి వస్తాల్రు, తెల్లటి పూలతో తెల్లని కాంతితోసరస్వతీదేవి ఉంటుందని అర్థం. తెల్లదనం సత్త్వగుణ సంపదకూ, స్వచ్ఛతకూ సంకేతం.సత్త్వగుణం కలిగి, స్వచ్ఛమైన హృదయం కలిగి ఉంటే, విద్యలకు సార్థకతకలుగుతుందని అంతరార్థం. మూలా నక్షత్రంనాడు సరస్వతీదేవిని పూజించటం, విద్యావంతులైనపెద్దలను గౌరవించటం సంప్రదాయం.
సరస్వతీ దేవిని వర్ణించిన వ్యాస మహర్షి
Related tags :