క్యాన్సర్ బాధితులకు చేయూతనిచ్చేందుకు సన్నీ లియోన్ ముందుకొచ్చారు. క్యాన్సర్ రోగుల చికిత్స కోసం నిధుల సేకరణకు తాను స్వయంగా వేసిన పెయింటింగ్‌ను వేలం వేయమని ఇచ్చారు. సన్నీ లియోన్ మాట్లాడుతూ ‘‘మా నాన్న క్యాన్సర్ కారణంగా మరణించారు. అందుకని, ఈ కార్యక్రమం నా మనసుకు దగ్గరైంది. దీని వల్ల నేను ఒక్కరిలోనైనా అవగాహన తీసుకురాగలిగినా, ఒక్కరి చికిత్సకు అవసరమైన డబ్బులు సమకూర్చగలిగినా…క్యాన్సర్‌పై యుద్ధంలో చిన్న విజయం సాధించినట్టే. పెయింటింగ్ వేసేటప్పుడు, కుంచె పట్టుకుని ప్రతి గీత గీసేటప్పుడు నాన్న ఆలోచనలే. ఆయన్ను నేనెంతగానో మిస్ అవుతున్నా. నిధులు సేకరించడమే కాదు…క్యాన్సర్‌పై యుద్ధం చేస్తున్నవారిలో ధైర్యాన్ని నింపేందుకు నా జీవితంలో జరిగిన విషయాలు కథలుగా చెబుతా’’ అన్నారు.
సన్నీ ఉదారత్వం
Related tags :