తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని తెలంగాణవాసులు ఆదేశ రాజధాని అబుదాబిలో శనివారం ఘనంగా జరుపుకున్నారు. అక్కడి తెలంగాణ సంఘం గత నెలరోజులుగా ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసింది. ఈ అద్భుత కార్యక్రమానికి స్థానిక ఇండియన్ సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ వేదికైంది. అయితే ఎడారి ప్రాంతం కావడం వల్ల పూలు దొరకడం చాలా కష్టం. కొనుగోలు చేయాలంటే చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం కావడంతో నిర్వాహకులు ఇండియా నుంచి రకరకాల పూలను, వందల కిలోల్లో తెప్పించి అబుదాబిని పూలవనంగా మార్చారు.
అబుదాబిలో బతుకమ్మ
Related tags :