బాలీవుడ్ నటి భూమీ పెడ్నేకర్ బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘ఫేస్ ఆఫ్ ఆసియా’ అవార్డును అందుకున్నారు. తాజగా ఆమె నటించిన ‘డాలీ కిట్టీ అవుర్ ఓ చమక్తే సితారే’ సినిమాను బుసాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. అక్కడి విమర్శకులను, ఆడియన్స్‌ను ఆ సినిమా మెప్పించడంతో ఆమెను ఈ పురస్కారం వరించింది. ‘‘అంతర్జాతీయ స్థాయిలో నేనందుకున్న తొలి పురస్కారమిది. చాలా గర్వంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాల్లో భాగమై, ప్రేక్షకుల మెప్పు పొందే స్థాయిలో నటిస్తా’’ అని భూమి తెలిపారు.
కొరియా అవార్డు
Related tags :