ప్రపంచ మహిళా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు శుభారంభం లభించింది. జమున బోరో… తన పవర్‌ఫుల్ పంచ్‌లతో ప్రత్యర్థిని చిత్తు చేసి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన 54 కేజీల తొలి రౌండ్ బౌట్‌లో అస్సాం రైఫిల్స్‌లో ఉద్యోగి అయిన జమున 5–0తో మిచిద్మా ఎర్దెనెదలై (మంగోలియా)ను ఓడించింది. నేడు జరిగే 57 కేజీల విభాగంలో క్వైయో జైరు (చైనా)తో నీరజ్ (భారత్); 75 కేజీల విభాగంలో ముంఖ్‌బాట్ (మంగోలియా)తో సవీటి బూరా తలపడతారు.
భారత బాక్సర్ బోరో విజయం

Related tags :